
భద్రాద్రి: మండలంలోని వినాయకపురం గ్రామంలో ఉన్న ఇర్ఫాన్ చికెన్ షాపులోకి ఓ కొండ చిలువ చొరబడి కలకలం సృష్టించింది. షాపు యజమాని సయ్యద్ ఇర్ఫాన్ బుధవారం ఉదయాన్నే షాపు తెరిచి కోళ్లు ఉన్న ఫారమ్‌లోకి వెళ్లగా, కొండ చిలువ కోళ్లను మింగుతూ కనిపించింది. స్థానికుల సమాచారంతో వచ్చిన ఫారెస్ట్ సిబ్బంది సుమారు 12 అడుగుల కొండ చిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు.