
అన్నమయ్య: పాముకాటుతో విద్యార్థి మృతిచెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు... మండలంలోని సోంపల్లె పంచాయతీ తంబళ్లవారిపల్లెకు చెందిన బి.చంద్రశేఖర్ కుమారుడు బి.యువరాజు (15) ఇంటి ఆవరణంలో మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోయాడు. పక్కనే ఉన్న చెట్ల పొదల్లో నుంచి వచ్చిన పాము కాటు వేసింది.
దీనితో అస్వస్థతకు గురయ్యాడు. ఉదయం ఎంతసేపటికి యువరాజ్ నిద్ర లేవకపోవడంతో గమనించిన తండ్రి లేపించాడు. విద్యార్థి పక్కలోనే పాము ఉండడాన్ని చూసి చంపేశారు. అప్పటికే తీవ్ర అస్వస్థతో ఉన్న బిడ్డను చూసి పాముకాటు వేసినట్లు గుర్తించి ములకలచెరువు పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో మదనపల్లె ప్రభుత్వ హాస్పెటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు.