
ప్రకాశం: తుళ్లూరు మండలం అనంతవరం ఆర్–5 జోన్‌లో విధుల నిమిత్తం వెళ్లిన తాళ్లూరు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఇరిగిపోయిన పవన్‌కుమార్ పాము కాటుకు గురై చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. రెండు రోజులుగా గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డయాలసిస్ చేసి అన్ని విధాలుగా ప్రయత్నించినా పవన్‌కుమార్ మృతి చెండటం పోలీస్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీస్ ఉన్నతాధికారులు, దర్శి డీఎస్పీ, సీఐ, ఎస్సైలు నిరంతర పర్యవేక్షణ చేసినా సరే పవన్‌కుమార్‌ను దక్కించుకోక పోయారు. పవన్‌కుమార్‌ది చీమకుర్తి పట్టణం. 2012 జవవరి 19లో పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. తాళ్లూరు, ఒంగోలు వన్ టౌన్, ముండ్లమూరులలో పనిచేసి మళ్లీ 2020 జనవరి 2న తాళ్లూరు పోలీస్ స్టేషన్‌లలో జాయిన్ అయ్యారు. ఎస్సైగా ఎప్పటికై నా ఎంపిక కావాలన్న ఆశయంతో ఉంటూ అంకితభావంతో పనిచేసే పవన్ ఇక లేక పోవటం దురదృష్టకరమని స్నేహితులు, ప్రజా ప్రతినిధులు అన్నారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. పవన్‌కుమార్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment