పాము కాటేస్తే విషం పీల్చి ప్రాణరక్షణ | daughter help to mother snake bite | Sakshi
Sakshi News home page

పాము కాటేస్తే విషం పీల్చి ప్రాణరక్షణ

Published Wed, Mar 22 2023 7:33 AM | Last Updated on Wed, Mar 22 2023 7:33 AM

daughter help to mother snake bite  - Sakshi

యశవంతపుర: కంటే కూతుర్నే కనాలి అనే మాటకు ఆ బాలిక నిదర్శనంగా నిలిచింది. తల్లికి పాము కాటు వేయగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమె ప్రాణాలను కాపాడిన ఘటన దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు తాలూకా కెయ్యూరు గ్రామంలో జరిగింది. సతీశ్‌ రై భార్య మమత వారం రోజుల క్రితం పొలంలో పనిచేస్తుండగా ఒక నాగుపాము కాటు వేసింది. ఆమె పరుగున ఇంటికి వెళ్లింది. కూతురు శ్రమ్య తల్లికి పాము కాటేసిన చోట నోటితో మూడుసార్లు విషం లాగి ఉమ్మేసింది.

తరువాత ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు చికిత్స చేయడంతో మమత కోలుకుంది. విషం శరీరంలోకి చేరని కారణంగా ప్రమాదం నుండి బయట పడినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా, శ్రమ్యను స్థానికులు అభినందనలతో ముంచెత్తారు. శ్రమ్య బీసీఎ చదువుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement