
ఒడిశా: జిల్లాలొని కాసీపూర్ సమితి చంద్రగిరి పంచాయతీ సిపిలిజొల్ గ్రామంలో పాముకాటుతో తల్లీకుమారులు మృతిచెందారు. బృందాబిసి(32), ఆమె కొడుకు బిజయ్ బిసి (9) ఎప్పట్లాగే శుక్రవారం వారు రాత్రి భోజనాలు చేసి నిద్రపోయారు.
అర్ధరాత్రి సమయంలో విష సర్పం ఇంటిలోకి ప్రవేశించి ముందుగా బిజయ్‌ను. పక్కనే ఉన్న బృందాను కాటువేసింది. మెలకువ తెచ్చుకున్న బృందా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చారు. పాము కాటువేసినట్టు గమనించి చంద్రగిరి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించేలోపే ఇద్దరూ ప్రాణాలు విడిచారు. ఒకే కుటుంబంలొ ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment