
చికిత్స పొందుతున్న విద్యార్థి కృష్ణ
పెద్దకొడప్‌గల్ (జుక్కల్): ఒకటీ రెండూ కాదు ఏకంగా మూడుసార్లు పాము కాటుకు గురయ్యాడు ఒక విద్యార్థి. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్‌లోని జెడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థి బర్ధవాల్ కృష్ణకు శుక్రవారం ఉదయం పాము కాటు వేసింది. వెంటనే ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాని కి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు.
మండలంలోని చావుని తండాకు చెందిన కృష్ణకు పాము కాటు వేయడం ఇది మూడోసారి. జూన్ 23న కూడా పెద్ద కొడప్‌గల్‌లోని బాలుర సంక్షేమ హాస్టల్‌లో ఇదే విద్యార్థికి పాము కాటు వేసింది. గతంలోనూ ఒక ప్రైవేటు స్కూల్‌లో కృష్ణను పాము కరిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment