
చిత్తూరు: పాటముకాటుకు ఇంటర్ విద్యార్థి మృతి చెందిన సంఘటన సదుం మండలంలో మంగళవారం జరిగింది. 108 సిబ్బంది కథనం మేరకు.. నడిగడ్డ పంచాయతీ కశిరెడ్డిగారిపల్లెకు చెందిన సుబ్రమణ్యం కుమారుడు సుదర్శనకుమార్(17) సదుం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. సాయంత్రం గ్రామంలో ఇంటి వద్ద స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా తొట్టి వద్ద పడిన బాల్ తీసుకొచ్చే క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. అతనిని 108లో సదుం సీహెచ్‌సీకి తీసుకొచ్చి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పీలేరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.