
ఆదిలాబాద్ (బేల) : మండలంలోని బెదోడకు చెందిన విద్యార్థిని పాము కాటేయడంతో మృతి చెందింది. వివరాలు ఇలా.. బాలేరావు సుభాష్–రంజన దంపతుల కుమార్తె ప్రణాళి (18) ఇంటి వద్ద శుక్రవారం పాముకాటుకు గురైంది. హోలీ పండుగ రోజు తన స్నేహితులతో ఆనందోత్సవాల మధ్యన ఉండగా, తన కాలేజీ బ్యాగ్‌లో ఉన్న రంగులు తీద్దామని ప్రయత్నించింది. అందులో ఉన్న పాము కాటేసింది. కుటుంబసభ్యులు ఆమెను రిమ్స్‌కు తరలించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చికిత్స పొందుతూ మృతిచెందింది. గతంలో ఏడు నెలల వ్యవధిలో రెండుసార్లు ఆమె పాము కాటుకు గురైంది. మూడోసారి పాముకాటుతో మృత్యువు ఒడిలోకి వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment