విష సర్పాన్ని ముద్దాడుతూ..
సాక్షి, సుభాష్‌నగర్(హైదరాబాద్): పాముకాటుకు గురై ఓ వ్యక్తి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆకాష్(30) నగరానికి వలసవచ్చి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గాజులరామారం డివిజన్ కట్టమైసమ్మబస్తీలో నివాసముంటున్నాడు. అతడు స్థానికంగా రాళ్లను కొడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కాగా పాములను పట్టుకోవడంలో దిట్ట అయిన ఆకాష్ ఆదివారం రాత్రి జనవాసాల్లోకి వచ్చిన విష సర్పాన్ని పట్టుకుని మెడలో వేసుకుని ముద్దుపెడుతూ సెల్‌ఫోన్ ఫొటోలకు పోజులిచ్చాడు.
అనంతరం సర్పాన్ని వదిలిపెట్టాడు. అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో అతను అస్వస్థతకు గురి కావడంతో సూరారంలోని నారాయణ ఆస్పత్రికి తరలించాడు. పాము కాటు వేయడంతోనే అస్వస్థతకు గురైనట్లు, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
చదవండి: వివాహేతర సంబంధం: ప్రియుడి మోజులో పడి ఇంట్లోనే..
Comments
Please login to add a commentAdd a comment