subhash nagar
-
కంపు చుట్టూ మా బతుకులు కనువిప్పని ప్రభుత్వాలు
-
విష సర్పాన్ని ముద్దాడి.. మృత్యువుతో పోరాటం!
సాక్షి, సుభాష్‌నగర్(హైదరాబాద్): పాముకాటుకు గురై ఓ వ్యక్తి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆకాష్(30) నగరానికి వలసవచ్చి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గాజులరామారం డివిజన్ కట్టమైసమ్మబస్తీలో నివాసముంటున్నాడు. అతడు స్థానికంగా రాళ్లను కొడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కాగా పాములను పట్టుకోవడంలో దిట్ట అయిన ఆకాష్ ఆదివారం రాత్రి జనవాసాల్లోకి వచ్చిన విష సర్పాన్ని పట్టుకుని మెడలో వేసుకుని ముద్దుపెడుతూ సెల్‌ఫోన్ ఫొటోలకు పోజులిచ్చాడు. అనంతరం సర్పాన్ని వదిలిపెట్టాడు. అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో అతను అస్వస్థతకు గురి కావడంతో సూరారంలోని నారాయణ ఆస్పత్రికి తరలించాడు. పాము కాటు వేయడంతోనే అస్వస్థతకు గురైనట్లు, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: ప్రియుడి మోజులో పడి ఇంట్లోనే.. -
సూట్‌కేసులో కుక్కి.. కాలువలో పడేసి
హైదరాబాద్/రామచంద్రాపురం(పటాన్చెరు): అది సుభాష్‌నగర్ డివిజన్లోని సుందర్‌నగర్ కాలనీ. సమయం రాత్రి 10 గంటలు కావస్తోంది. మఫ్టీలో ఉన్న పోలీసులు ఓ వ్యక్తి చేతులకు సంకెళ్లు వేసి తీసుకువచ్చారు. అసలేమి జరుగుతుందో స్థానికులకు అర్థం కాని పరిస్థితి. సరిగ్గా అర్ధగంట వ్యవధిలో మురికి కాలువ నుంచి ఓ పెద్ద సూట్‌కేసును వెలికి తీయించారు. సంకెళ్లున్న వ్యక్తితో సూట్ కేసు తెరిపించగా అందులో ఓ యువతి శవం కనిపించింది. దీంతో అక్కడున్న స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. తనను పెళ్లి చేసుకోమని సదరు యువతి ఒత్తిడి చేయడంతో ప్రియుడే హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. పెళ్లి ప్రస్తావనతోనే హత్య..: రామచంద్రాపురం పట్టణం ఎల్ఐజీ కాలనీలో నివాసం ఉండే లావణ్య (25) ఇంజనీరింగ్ పూర్తి చేసి.. హైదరాబాద్‌లోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. సుభాష్‌నగర్ డివిజన్ సుందర్‌నగర్ కాలనీకి చెందిన మనోజ్ కుమారుడైన సునీల్‌కుమార్ (26) జూబ్లీహిల్స్‌లోని మోల్డ్‌టెక్‌లో పనిచేస్తున్నాడు. ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. 2017లో సునీల్‌కుమార్ తాను ప్రేమిస్తున్నానని లావణ్యకు తెలిపాడు. దాన్ని లావణ్య అంగీకరించింది. అనంతరం వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. లావణ్య తనను పెళ్లి చేసుకోవాలని సునీల్‌పై ఒత్తిడి పెంచింది. ఆ సందర్భంలో సునీల్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎంగేజ్మెంట్ కూడా జరుపుకునేందుకు నిర్ణయించాడు. అనంతరం తన తల్లిదండ్రులకు ప్రమాదం జరిగిందని సాకులు చెప్పి ఎంగేజ్మెంట్ రద్దు చేశాడు. ఈ నెల 4న లావణ్య ఇంటికి వచ్చిన సునీల్ తనకు మస్కట్‌లో ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. నీకు కూడా అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఈ క్రమంలో లావణ్యను తీసుకొని శంషాబాద్‌లోని ఓ లాడ్జిలో దిగాడు. ఈ నెల 5న లావణ్యను హత్యచేసి ఆమె మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టుకొని కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం కాలనీలోని డ్రైనేజీలో పడేశాడు. లావణ్య తల్లిదండ్రులకు అనుమానం రాకుండా మృతురాలు లావణ్యకు చెందిన సెల్‌ఫోన్ నుంచి 5వ తేదీన మస్కట్ చేరుకున్నట్టు మెసేజ్ పెట్టాడు. తిరిగి 7వ తేదీన మస్కట్ నుంచి వస్తున్నట్లు మెసేజ్ చేశాడు. మియాపూర్ బస్సులో ఉన్నట్లు లొకేషన్ షేర్ చేసి మృతురాలి ఫోన్ నంబర్‌ను స్విచ్ ఆఫ్ చేశాడు. ఎంతకీ లావణ్య ఇంటికి రాకపోయేసరికి ఆమె కుటుంబ సభ్యులు తిరిగి సునీల్‌కు ఫోన్ చేశారు. తను మస్కట్ నుంచి బయల్దేరి వస్తున్నానని మృతురాలి తల్లిదండ్రులకు తెలిపాడు. వారు ఎయిర్ పోర్టుకు వస్తానని చెప్పడంతో రావద్దని వారించాడు. దాంతో అనుమానం వచ్చిన మృతురాలి కుటుంబ సభ్యులు వెళ్లి సునీల్ కోసం వేచి చూశారు. అయితే లావణ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సునీల్ తనను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని చెప్పాడు. దానిపై అనుమానం వచ్చిన లావణ్య తల్లిదండ్రులు రామచంద్రాపురం పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. లావణ్య ఇచ్చిన తినుబండారాలు సునీల్ ఇంట్లో దొరకడంతో పోలీసులు విచారణ జరిపారు. పోలీసులు సునీల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. సూట్ కేసులో మృతదేహం ఉన్న ప్రాంతానికి శనివారం రాత్రి నిందితుడిని తీసుకొచ్చి వెలికి తీయించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణం తీసిన అకాల వర్షం
కుత్బుల్లాపూర్ (హైదరాబాద్): నగరంలో కురిసిన అకాల వర్షానికి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సుభాష్‌నగర్‌లో జరిగింది. మంగళవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి సుభాషనగర్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఓ ఇంట్లో విద్యుద్ఘాతం సంభవించి సిద్దు(25) అనే యువకుడు మృతి చెందాడు. మృతునికి నెల పాప, ఏడాది వయస్సు ఉన్న బాబు ఉన్నారు. ఇంటి ఆధారం కోల్పోయిన ఆ కుటుంబ తీవ్ర విషాదంలో ఉంది. -
పదో తరగతి చదివే సమయంలో లొంగదీసుకుని..
చింతగట్టు(హసన్‌పర్తి) : ఓ విద్యార్థిని పదో తరగతి చదివే సమయంలో లొంగదీసుకున్నాడో ప్రబుద్ధుడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి విందులు, వినోదాలకు తీసుకెళ్లాడు. నాలుగేళ్లుగా వెంట తిరిగి.. చివరికి ఇప్పుడు తనకేమి సంబంధం లేదని ముఖం చాటేయడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రరుుంచింది. బాధితురాలి కథనం ప్రకారం.. చింతగట్టు శివారులోని సుభాష్ నగర్‌కు చెందిన మేకల అనూష, అదే ప్రాంతానికి చెందిన నద్దునూరి అనిల్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో అనిల్ హైదరాబాద్‌లో రెండేళ్లు పాస్టర్‌గా శిక్షణ పొందాడు. ఆ సమయంలోనూ తాను తరచూ హైదరాబాద్ వెళ్లేదానినని అనూష తెలిపింది. శిక్షణ పూర్తరుున తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అతడు.. తీరా శిక్షణ పూర్తరుున తర్వాత పెళ్లి మాటెత్తితే దాట వేస్తూ వచ్చాడు. గత మూడు నెలలుగా ఫోన్ చేయడం మానేశాడు. మూడు రోజుల క్రితం ఫోన్ చేసి పెళ్లి గురించి అడగగా.. సమాధానం చెప్పకుండా సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేశాడని చెప్పింది. దీంతో తాను పోలీసులను ఆశ్రయించినట్లు వివరించింది. అరుుతే అతడిపై కేసు పెట్టొద్దని.. ఎలాగైనా పెళ్లి జరిపించేలా చూడాలని అనూష వేడుకుంటోంది. కొలిక్కిరాని పంచారుుతీ అనూష ఫిర్యాదుతో పోలీసులు ఇరువురిని పిలిచి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఇరువర్గాల పెద్దలు కూర్చుని సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. నాలుగు గంటలపాటు ఇరువైపుల పెద్దల మధ్య వాదోపవాదాలు జరిగాయి. అయినా సమస్య కొలిక్కిరాలేదు. దీంతో బాధితురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ దీక్షకు దిగింది. అతడి ఇంటి ముందు టెంట్ వేసి కూర్చోగా.. స్థానిక మహిళలు ఆమెకు అండగా నిలిచారు. -
‘రియల్’ దందా
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : రియల్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్న ప్రజలకు ఎరవేస్తున్నారు. అపార్ట్మెంట్ నిర్మించి ప్లాట్ ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. వారి డబ్బులతోనే వ్యాపారం చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. అయితే డబ్బులు ఇచ్చినవారికి ప్లాట్ మాత్రం ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు అడిగినా ఇగో.. అగో అని తప్పించుకుంటున్నారు. బలవంతులైన మోసగాళ్లను ఏమీ చేయలేని మధ్యతరగతి ప్రజలు.. తమ అదృష్టాన్ని నిందించుకుంటూ మౌనంగా రోదిస్తున్నారు. తక్కువ సమయంలోనే కోట్లాది రూపాయలు గడించవచ్చు అని భావిస్తున్న కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగిడుతున్నారు. రాత్రికి రాత్రే బోర్డు పెట్టుకుని ఆకర్షణీయమైన ప్రకటనలిస్తున్నారు. ప్రధానంగా విదేశాల్లో ఉండి నగరంలో స్థలాలు, ఇళ్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేయాలనుకునేవారి వివరాలు సేకరిస్తున్నారు. వారితో పరిచయాలు పెంచుకొని వల వేస్తున్నారు. తక్కువ ధరలకే స్థలాలు ఇప్పిస్తామని నమ్మిస్తున్నారు. డబ్బులు తీసుకొని తప్పించుకు తిరుగుతున్నారు. మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుందని చెప్పి పెట్టుబడులు పెట్టిస్తున్నారు. తర్వాత ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇలాంటి ఘటనలు నగరంలో పలు జరిగాయి. మోసం చేస్తున్నారిలా.. నగరంలో ఓ వర్గానికి చెందిన కొందరు వివిధ రాజకీయ నాయకులతో సన్నిహితంగా ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వీరికి రాజకీయ నాయకుల అండదండలుండడంతో వీరు నగరంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. ప్రజలను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఆర్మూర్‌కు చెందిన ఓ పార్టీ నాయకుడు తన ఆస్తిని వీరికి రూ. 65 లక్షలకు విక్రయించాడు. ఆస్తిని కొనుగోలు చేసిన సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు డబ్బులు చెల్లించలేదు. డబ్బులు తర్వాత ఇస్తామని, తాము చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చే లాభాన్ని నెలనెలా చెల్లిస్తామని నమ్మించారు. నెలలు గడుస్తున్నా సదరు నాయకుడికి ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని తెలుస్తోంది. దీంతో తాను మోసపోయానని సదరు నాయకుడు భావిస్తున్నట్లు సమాచారం. అయితే తాను మోసపోయిన విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఆయన లోలోన కుమిలిపోతున్నట్లు తెలిసింది. తన డబ్బులు రాబట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చాలా మందినే మోసం చేసినట్లు తెలుస్తోంది. సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు నగరంలో మైనారిటీలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో అపార్ట్మెంట్ నిర్మిస్తున్నామని చెప్పి పలువురి వద్దనుంచి డబ్బులు తీసుకున్నారు. మూడేళ్లవుతున్నా ఎలాంటి పురోగతిలేదు. దీంతో డబ్బులిచ్చినవారు ఆందోళన చెందుతున్నారు. సదరు వ్యాపారులకు రాజకీయ నాయకుల అండదండలుండడంతో డబ్బులకోసం నిలదీయలేకపోతున్నారని సమాచారం. అధికారులు స్పందించి రియల్ ఎస్టేట్ వ్యాపారం, అపార్ట్మెంట్ల నిర్మాణంపై దృష్టి సారించాలని, మోసాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
కష్టానికి ఫలితం
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులతో హడలెత్తించడంతోపాటు, పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే వ్యాపారులకు అవగాహన సదస్సులు నిర్వహించి పన్ను చెల్లించే విధంగా చైతన్యపరిచారు. పన్నులు ఎగ్గొట్టేవారిని గుర్తించి వారి సంస్థలపై దాడులు సైతం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారు ఆశించిన దాని కంటే అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. అదే విధంగా వాణిజ్య పన్నులశాఖ అధికారులు సైతం పన్నులు ఎగొట్టే వ్యాపారులకు నోటీసులు జారీ చేసి గడువులోపు తమ టార్గెట్ ను పూర్తి చేసుకున్నా రు. ఆన్లైన్ విధానం రావడంతో పన్నులు ఎగ్గొడుతున్న వ్యాపారులను గుర్తించి వారికి నేరుగా నోటీసులు జారీచేశారు. దీని ద్వారా వారి వద్ద నుంచి ఆశించిన మేర పన్నులను వసూలు చేశారు. గత ఏడాది కంటే అధికం గత ఏడాది జిల్లాలో ఆదాయపు పన్ను శాఖకు సుమా రు రూ. 18 కోట్ల మేర లక్ష్యం నిర్దేశించగా, 31మార్చి 2013 నాటికి సుమారు రూ. 28 కోట్ల మేరకు ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. 2013-2014 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.23 కోట్ల లక్ష్యం కాగా, 31మార్చి 2014 నాటికి రూ.35 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. జిల్లా ఆదాయపు శాఖ పరిధిలో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు వస్తాయి. అదే విధంగా వాణిజ్యపన్నుల శాఖకు గతేడాది రూ. 458.37 కోట్లు ఆదాయం రాగా, ఈ ఏడాది మార్చి31 వరకు రూ.516 కోట్లు ఆదాయం సమకూరింది. జిల్లా వాణిజ్యశాఖ పరిధిలోకి మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్ వస్తాయి. అంటే గతేడాది కన్న ఈ ఏడాది సు మారు 13 శాతం అదనంగా పన్నులు వసూలయ్యా యి. ఒక్క మార్చిలోనే వాణిజ్య పన్నుల శాఖకు రూ.71 కోట్ల మేరకు ఆదాయం సమకూరింది. గత మార్చిలో మాత్రం రూ.51 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. గత మార్చితో పోల్చితే ఈ ఏడాది రూ.20 కోట్లు ఆదాయం అదనంగా సమకూరింది. ఇది కూడా వ్యాట్ ద్వారా వచ్చినట్లు అధికారులు తెలిపారు. టార్గెట్ పూర్తయినా దాడులు ఆపం 2013-2014 వార్షిక సంవత్సరంతో తమ శాఖలకు నిర్దేశించిన టార్గెట్లు పూర్తయినప్పటికీ దాడులను ఆపబోమని ఆదాయపు పన్నుల శాఖాధికారులు పేర్కొన్నారు. ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే పన్ను చెల్లించని వ్యాపారులపై నిఘా పెడతామన్నారు. అలాంటి వారిని గుర్తించి దాడులు చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా వాణిజ్యపన్నుల శాఖాధికారులు సైతం ఆదాయాన్ని రాబట్టుకోవడానికి వ్యాపారులకు అవగాహనతో పాటు నోటీసులు జారీచేసి పన్నులు రాబట్టుకుంటామన్నారు. -
పేరుకే ఈఎస్ఐ ఆస్పత్రి
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ)కార్మికుల ఆరోగ్య బీమా ఆస్పత్రి ఆశించిన ఫలి తాన్ని ఇవ్వడం లేదు. చిక్సిత కోసం వచ్చే కార్మికులకు ఇక్కడ సకాలంలో వై ద్య చికిత్సలు అందక పోవడంతో ప్రై వేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో విధుల్లో ఉండే వైద్యులు కేవలం సంతకాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విధు ల్లో ఉండాల్సిన వైద్యులు తమ ప్రైవే టు ఆస్పత్రులకే పరిమితమవుతున్నా రు. ప్రజాప్రతినిధుల అండదండలతో విధులకు ఎగనామం పెడుతున్నట్లు ఆ రోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కో ట్ల రూపాయలతో నిర్మించిన ఆస్పత్రి భవనం నిరుపయోగంగా మారింది. ఆస్పత్రిలో గతంలో ఉన్న పరికరాలను ఇతర ప్రాంతాలకు తరలించడంతో మెరుగైన వైద్య సేవలు అందడం లేవు. దీంతో ఆస్పత్రిలోని గదులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కార్మికుల కోసం ఏర్పాటు.. జిల్లావ్యాప్తంగా వివిధ రంగాల్లో కార్మికులుగా ఉన్న వారి ఆరోగ్య పరిరక్షణ కోసం 2000 సంవత్సరంలో అప్పటి ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి జిల్లాకేంద్రంలోని న్యాలకల్ రోడ్డులో ఈఎస్ఐ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆస్పత్రిలో సుమారు 10వేలకు పైగా కార్మికులు సభ్యులుగా (కార్డులు) పొందారు. వీరికి సేవలు అందించేందుకు ఇన్పేషంట్లకు 50 పడకలను ఏర్పాటు చేశారు. వారికి మెరుగైన వైద్య సేవలందించేందుకు వివిధ రకాల పరికరాలను సైతం ఆస్పత్రిలో అమర్చారు. కాని వైద్యులు రోగులకు వైద్య సేవలందించడంలో విఫలమవడంతో వాటిని ఇతర ప్రాం తాలకు తరలించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో .. ఈఎస్ఐ ఆస్పత్రికి కేంద్ర ప్రభుత్వం నిధులను మొదట రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేస్తుం ది. రాష్ట్ర ప్రభుత్వం తన నిధులతో కలిపి ఆస్పత్రికి విడుదల చేస్తుంది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ నిధులను మింగేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. వేధిస్తున్న వైద్యుల కొరత.. ఆస్పత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. వైద్యులతో పాటు సిబ్బంది సైతం తక్కువగానే ఉన్నారు. గతంలో 30 మంది సిబ్బంది ఉండ గా, వారిలో నుంచి 15 మందిని తొలగించినట్లు తెలిసింది. వివిధ విభాగాల కు సంబంధించి సుమారు 50 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 8 మంది మాత్రమే ఉన్నా రు. వీరు కూడా కేవలం సంతకాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలున్నాయి.ఆస్పత్రి నిర్వహణను పర్యవేక్షించాల్సిన సూపరింటెం డెంట్ తన స్వంత నర్సింగ్‌హోంను నడుపుకోవడానికి సమయాన్ని కేటాయిస్తారు. అడపాడపా ఆస్పత్రికి వచ్చి కేవలం సంతకం మాత్రమే చేసి వెళ్లిపోతారనే ఆరోపణలు ఉన్నాయి. ఏళ్ల తరబడి కొనసాగింపు.. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని నడుపుతున్న వైద్యుడు ఈఎస్ఐ ఆస్పత్రికి సూపరింటెండెంట్‌గా కొనసాగుతున్నారు. ఆయనపై గతంలో పలు ఆరోపణలు రావడంతో ఆయనను కొన్ని రోజులు ఇక్కడి నుంచి వేరో చోటకి బదిలీ చేసినట్లు తెలిసింది. అయితే ప్రజాప్రతినిధిల అం డదండలతో ఆయన తిరిగి ఇక్కడే పోస్టింగ్‌ను వేయించుకున్నట్లు కార్మిక నాయకులు, కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆస్పత్రికి వచ్చే నిధులను ఆయన తన ఖాతాలోకే జమ చేసుకుంటున్నాడని వారు ఆరోపించారు. -
ప్రజారోగ్యం గాలిలో దీపం
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్: నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర పట్టణ ప్రాంతాలలో చిన్న, పెద్ద హోటళ్లు, దాబాలు, ఫ్యా మిలీ రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు వందల సంఖ్యలో ఉన్నాయి. చిన్నచిన్న పట్టణాలు, గ్రామాలలోనూ హోటళ్లున్నాయి. మందుబాబు ల కోసం ప్రతి వైన్ షాప్, బెల్ట్ షాప్‌ల వద్ద ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు వెలిశాయి. వీటిపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కేంద్రాల నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. పదార్థాల తయారీలో నాసి రకం వస్తువులు, నూనెలు వాడుతున్నారు. పరిసరాల పరిశుభ్రతను పట్టించుకోకపోవడంతో తినుబండారాలపై ఈగలు, క్రిమికీటకాదులు వాలుతూ ప్రజలను ఆనారోగ్యం పాలు చేస్తున్నాయి. చిన్న హోటళ్లు పేద మధ్య తరగతి ప్రజలు చిన్న హోటళ్లకే వెళ్తుంటారు. ఇక్కడ తక్కువ ధరకు ఆహార పదార్థాలు లభిస్తుండడమే ఇందుకు కారణం. అయితే ఎక్కువగా చిన్న హోటళ్లు ఇరుకు గదుల్లో, మురికి కూపాలలోనే ఉంటున్నాయి. పరిశుభ్రత అన్నది భూతద్దంతో వెతికినా కనిపించదు. తక్కువ ధరకు టిఫిన్లు, భోజనం అందించడం కోసం వారు చవుకబారు వస్తువులనే వాడుతున్నారు. అధికారులు వీటి వైపు కన్నెత్తి చూడకపోవడంతో చిరు హోటళ్ల నిర్వాహకుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. బడా హోటళ్లలోనూ జిల్లావ్యాప్తంగా పేరు పొందిన బడా హోటళ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. పైకి చక్కగా కనిపించినా, వాటి కిచెన్, పరిసరాలు మరీ అధ్వానంగా ఉం టాయి. అంటే పైన పటారం లోన లొటారం అన్న చందంగా ఉంటాయి. మిగిలిపోయిన ఆహార పదార్థాలను నిల్వ చేసి తరువాతి రోజుల్లో విక్రయిస్తారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఆ రోజు మిగిలిన మాంసాహారాన్ని నిల్వ ఉంచి, తర్వాతి రోజు వేడి చేసి వడ్డిస్తున్నారని తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా చాలా మంది అస్వస్థతకు గురి అవుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో జిల్లావ్యాప్తంగా ప్రతి కూడలిలో ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలున్నాయి. వీటిలో పరిశుభ్రత దేవతావస్త్రమే. వీరు వాడే వస్తువులు చాలా వరకు నాసిరకంగా ఉంటాయి. ఇక నూనె అయితే కడాయిలో గంటల తరబడి కాగుతూనే ఉంటుంది. తర్వాతి రోజు ఆ నూనెలోనే మళ్లీ కొత్త నూనె పోసి ఫాస్ట్ఫుడ్స్ తయారు చేస్తుంటారు. ఇది జగమెరిగిన సత్యం. అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలపై దృష్టి సారించడంలేదన్న విమర్శలున్నా యి. దీంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. మార్పు తీసుకొచ్చి చర్యలు తీసుకుంటాం : అమృతశ్రీ, జిల్లా ఆహార భద్రత అధికారి పరిశుభ్రత పాటించని హోటళ్ల నిర్వాహకులతో మాట్లాడతాం. వారిలో మార్పు తీసుకువస్తాం. ఒకేసారి మార్పు రావడం కష్టం. మెల్లిమెల్లిగా విజయం సాధిస్తాం. ప్రజారోగ్యం విషయంలో రాజీపడబోం. నిబంధనలు పాటించని హోటళ్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తాం. -
వక్ఫ్ ఆస్తులను కబ్జాచేస్తే క్రిమినల్ కేసులు
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్: జిల్లాలోని వక్ఫ్‌బోర్డు ఆస్తులను కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెడతామని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ప్రత్యేకాధికారి ఎక్బాల్ అహ్మద్ హెచ్చరించారు. త్వరలోనే జిల్లా పర్యటన చేసి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమావేశమై వక్ఫ్ ఆస్తుల గురించి చర్చిస్తానని ఆయన తెలిపారు. వక్ఫ్ భూములను అనుమతులు లేకుండా కబ్జా చేసిన వారిని, అక్రమ లీజుకు తీసుకున్న వారిని గుర్తించి వారిపై కేసులు పెట్టించి అరెస్ట్ చేయిస్తామని ఆయన తెలిపారు. జిల్లాలో అన్యాక్రాంతమవుతున్న వక్ఫ్‌బోర్డు ఆస్తులపై ‘న్యూస్‌లైన్’ ఆయనతో ఫోన్లో సంప్రదించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలో వేల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయినట్లు చెప్పారు. అందుకు బాధ్యులైన ముతవలీలపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు పెట్టిస్తామన్నారు. ప్రధానంగా నిజామాబాద్ కంఠేశ్వర్ ప్రాంతంలో గల దర్గా హజరత్ కమాల్‌షా బియాబానికి సంబంధించిన ఆస్తులను ముతవలీగా ఉన్న శేర్అలీషా బోర్డు అనుమతులు లేకుండా ఇతరులకు లీజుకు ఇచ్చిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.ఆ ఆస్తులను బోర్డు స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఆ ఆస్తులను అనుభవిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బోర్డు అనుమతులు లేకుండా అక్రమ లీజుకు ఇచ్చిన ముత్తవ లీ శేర్అలీషాపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, అయితే పోలీసులు ఆయనను అరెస్ట్ చేయలేదని తెలిపారు. బోర్డు ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనుకంజవేసేది లేదన్నారు. జిల్లాలోని ఆస్తులను గుర్తించి వాటి వివరాలను సేకరించే పనిలో తమ సిబ్బంది నిమగ్నమయ్యారని తెలిపారు. నివేదిక రాగానే తాను జిల్లా పర్యటనకు వస్తానని ఆయన చెప్పారు. అక్రమాలు వెలుగు చూసింది ఇలా... జిల్లాలో కబ్జాకు గురైన వక్ఫ్ ఆస్తులను వక్ఫ్‌బోర్డు జిల్లా మాజీ చైర్మన్ మహ్మద్ మాజిద్‌ఖాన్ వెలికి తీశారు. కోట్ల రూపాయల విలువ చేసే కంఠేశ్వర్ ప్రాంతంలోని దర్గా హజరత్ కమాల్‌షా బియాబానికి పేరుతో ఉన్న ఆస్తులతో పాటు, నగరంలోని పాత ఈద్గాకు చెందిన స్థలాల వివరాలను బోర్డుకు ఆయన నివేదిక అందజేశారు. అక్రమాలకు పాల్పడ్డ ముత్తవలీపై చర్యలు తీసుకోవాలని బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన బోర్డు టాస్క్‌ఫోర్స్ బృందం నగరంలో పర్యటించి విచారించింది. బృందం నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించింది. దీంతో ముత్తవలీపై క్రిమినల్ కేసు పెట్టి ఆయనను సస్పెండ్ చేశారు. దర్గాకు సంబంధించిన ఆస్తులను తమ ఆధీనంలోకి(డెరైక్ట్ మేనేజ్మెంట్)లోకి తీసుకున్నారు.అయినప్పటికి ఇప్పటి వరకు ఆయనను అరెస్ట్ చేయక పోవడమే కాకుండా బోర్డుకు చెందిన స్థలంలో అనుమతులు లేకుండా పెట్రోల్‌బంక్ నిర్మాణానికి కొత్త చైర్మన్ పావులు కదుపుతున్నట్లు తెలిసింది. దీనిపై సీరియస్‌గా ఉన్న ప్రత్యేకాధికారి ఎక్బాల్అహ్మద్ జిల్లా పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయి. అదే విధంగా బోర్డు స్థలాల్లో నిర్మించిన ఫంక్షన్‌హాల్, గ్యాస్పంపులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.