పేరుకే ఈఎస్‌ఐ ఆస్పత్రి | doctors neglect on workers | Sakshi
Sakshi News home page

పేరుకే ఈఎస్‌ఐ ఆస్పత్రి

Published Wed, Apr 2 2014 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 5:27 AM

doctors neglect on workers

సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్‌ఐ)కార్మికుల ఆరోగ్య బీమా ఆస్పత్రి ఆశించిన ఫలి తాన్ని ఇవ్వడం లేదు. చిక్సిత కోసం వచ్చే కార్మికులకు ఇక్కడ సకాలంలో వై ద్య చికిత్సలు అందక పోవడంతో ప్రై వేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో విధుల్లో ఉండే వైద్యులు కేవలం సంతకాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విధు ల్లో ఉండాల్సిన వైద్యులు తమ ప్రైవే టు ఆస్పత్రులకే పరిమితమవుతున్నా రు. ప్రజాప్రతినిధుల అండదండలతో విధులకు ఎగనామం పెడుతున్నట్లు ఆ రోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కో ట్ల రూపాయలతో నిర్మించిన ఆస్పత్రి భవనం నిరుపయోగంగా మారింది. ఆస్పత్రిలో గతంలో ఉన్న పరికరాలను ఇతర ప్రాంతాలకు తరలించడంతో మెరుగైన వైద్య సేవలు అందడం లేవు. దీంతో ఆస్పత్రిలోని గదులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

 కార్మికుల కోసం ఏర్పాటు..
 జిల్లావ్యాప్తంగా వివిధ రంగాల్లో కార్మికులుగా ఉన్న వారి ఆరోగ్య పరిరక్షణ కోసం 2000 సంవత్సరంలో అప్పటి ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి జిల్లాకేంద్రంలోని న్యాలకల్ రోడ్డులో ఈఎస్‌ఐ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆస్పత్రిలో సుమారు 10వేలకు పైగా కార్మికులు సభ్యులుగా (కార్డులు) పొందారు. వీరికి సేవలు అందించేందుకు ఇన్‌పేషంట్లకు 50 పడకలను ఏర్పాటు చేశారు. వారికి మెరుగైన వైద్య సేవలందించేందుకు వివిధ రకాల పరికరాలను సైతం ఆస్పత్రిలో అమర్చారు. కాని వైద్యులు రోగులకు వైద్య సేవలందించడంలో విఫలమవడంతో వాటిని ఇతర ప్రాం తాలకు తరలించారు.

 కేంద్ర ప్రభుత్వ నిధులతో ..
 ఈఎస్‌ఐ ఆస్పత్రికి కేంద్ర ప్రభుత్వం నిధులను మొదట రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేస్తుం ది. రాష్ట్ర ప్రభుత్వం తన నిధులతో కలిపి ఆస్పత్రికి విడుదల చేస్తుంది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ నిధులను మింగేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

 వేధిస్తున్న వైద్యుల కొరత..
 ఆస్పత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. వైద్యులతో పాటు సిబ్బంది సైతం తక్కువగానే ఉన్నారు. గతంలో 30 మంది సిబ్బంది ఉండ గా, వారిలో నుంచి 15 మందిని తొలగించినట్లు తెలిసింది. వివిధ విభాగాల కు సంబంధించి సుమారు 50 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 8 మంది మాత్రమే ఉన్నా రు. వీరు కూడా కేవలం సంతకాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలున్నాయి.ఆస్పత్రి నిర్వహణను పర్యవేక్షించాల్సిన సూపరింటెం డెంట్ తన స్వంత నర్సింగ్‌హోంను నడుపుకోవడానికి సమయాన్ని కేటాయిస్తారు. అడపాడపా ఆస్పత్రికి వచ్చి కేవలం సంతకం మాత్రమే చేసి వెళ్లిపోతారనే ఆరోపణలు ఉన్నాయి.

 ఏళ్ల తరబడి కొనసాగింపు..
 నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని నడుపుతున్న వైద్యుడు ఈఎస్‌ఐ ఆస్పత్రికి సూపరింటెండెంట్‌గా కొనసాగుతున్నారు. ఆయనపై గతంలో పలు ఆరోపణలు రావడంతో ఆయనను కొన్ని రోజులు ఇక్కడి నుంచి వేరో చోటకి బదిలీ చేసినట్లు తెలిసింది. అయితే ప్రజాప్రతినిధిల అం డదండలతో ఆయన తిరిగి ఇక్కడే పోస్టింగ్‌ను వేయించుకున్నట్లు కార్మిక నాయకులు, కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆస్పత్రికి వచ్చే నిధులను ఆయన తన ఖాతాలోకే జమ చేసుకుంటున్నాడని వారు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement