Employees State Insurance
-
ఆ బురద మాకు కూడా అంటిస్తారా?
సాక్షి, విశాఖ : విజిలెన్స్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఈఎస్ఐ మందుల కుంభకోణం ఆంధ్రప్రదేశ్‌లో దుమారం రేపుతోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ..‘టెలీ మెడిసిన్ విషయంలో ప్రధానమంత్రి చెబితేనే చేశానని అచ్చెన్నాయుడు చెప్పడం హాస్యాస్పదం. కేంద్రం అభివృద్ధి పనులపై రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది కానీ అవినీతి చేయమని చెప్పదు. టీడీపీ నేతలు తినడానికి అలవాటు పడ్డారు. మరో రాష్ట్రంలో తప్పు జరిగిందని అదే తప్పులు చేస్తాం అనడం సరికాదు. తినడానికి అలవాటు పడ్డారు అది మందులు కావచ్చు...మరేదైనా సరే అది దోచుకోవడమే. (కార్మికుల సొమ్ము కట్టలపాము పాలు!) చంద్రబాబు నాయుడుకి దగ్గర అవడానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. ఒక వార్డులో బీజేపీ నుంచి 300మంది నాయకులు టీడీపీలో చేరిపోయారని గంటా ప్రచారం విడ్డూరంగా ఉంది. టీడీపీ దూరం పెట్టిందని గంటా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. గంటా కారు నంబర్ 1..అలాగే తప్పుడు ప్రచారం చేయడంలో కూడా ఆయన నంబర్ వన్. ఇలాంటి నాయకులను నమ్మడం వల్లే చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు దక్కాయి. టీడీపీ చేరినవారంతా రూ.250 బ్యాచ్’ అని వ్యాఖ్యానించారు. (ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) చంద్రబాబు పాత్రపైనా విచారణ చేయాలి ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని బీజేపీ అధికార ప్రతినిధి కోట సాయికృష్ణ డిమాండ్ చేశారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ..‘అచ్చెన్నాయుడు అవినీతిలో కూరుకుపోయాడు కాబట్టే మోదీ పేరు ప్రస్తావిస్తున్నారు. టీడీపీ అవినీతి బురద బీజేపీకి అంటించాలని చూస్తున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపైనా విచారణ జరపాలి. టీడీపీ ప్రభుత్వం పాల్పడిన అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అచ్చెన్నాయుడు చెప్పిన మాటలకు...ఈఎస్ఐకి రాసిన లేఖకు పొంతన లేదు’ అని అన్నారు. ఈఎస్ఐ స్కాం: వారిని శిక్షించాలి.. విజయవాడ: మరోవైపు ఈఎస్ఐలో భారీ కుంభకోణం వెలుగుచూడటంతో ఏపీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులకు చెందిన కోట్లది రూపాయల నిధులు దిగమింగిన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణలతో పాటు అధికారులను శిక్షించాలంటూ విజయవాడ ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం శనివారం ఆందోళనకు దిగింది. స్వాహా చేసిన సొమ్మును రికవరీ చేసి ఈఎస్ఐ అభివృద్ధికి వెచ్చించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. చందాదారులైన ఉద్యోగ,కార్మికలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అవినీతి నుంచి తప్పించుకునేందుకు కులం కార్డు వాడటం ఏంటని ప్రశ్నించారు. -
ఉద్యోగులందరూ ఈఎస్ఐకు అర్హులే
హోదాతో పనిలేదు హైకోర్టు కీలక తీర్పు సాక్షి, హైదరాబాద్: ఏదైనా కంపెనీ లేదా సంస్థలో పని చేస్తున్న ప్రతి వ్యక్తీ(అతను ట్రైనీ అయినప్పటికి), హోదాతో నిమిత్తం లేకుండా ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్(ఈఎస్ఐ) కింద లభించే అన్ని ప్రయోజనాలు పొందేందుకు అర్హుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తులు జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ ఎస్.వి.భట్, జస్టిస్ ఎ.శంకర నారాయణ, జస్టిస్ అనిస్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. ఆర్సీసీ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేసే ట్రైనీ ఈఎస్ఐ కింద లభించే ప్రయోజనాలను పొందేందుకు అర్హుడేనని ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కోర్టు 1997లో తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆర్సీసీ లిమిటెడ్ హైకోర్టులో 1998లో పిటిషన్ దాఖలు చేసింది. మొదట ఈ వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారించి, ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నివేదించారు. ఆ తరువాత విచారణ చేపట్టిన ధర్మాసనం, దీనిని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి నివేదించింది. ఆ తరువాత విస్తృత ధర్మాసనం ఈ వ్యవహారాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. దీంతో విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. -
ఈఎస్ఐ రోగుల నరకయాతన
* రీయింబర్స్మెంట్ కోసం వేలాది మంది ఎదురుచూపులు * నిధులను తన్నుకుపోతున్న మందుల సరఫరాదారులు సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్) పరిధిలోని రోగులు పడుతున్న నరకయాతన అంతాఇంతా కాదు. కావాల్సిన వైద్యం ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అందక, తీరా ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటే.. ఈఎస్ఐ ఆ డబ్బులివ్వక వారి పరిస్థితి ఘోరంగా తయారైంది. రీయింబర్స్మెంట్ కోసం రోగులు ఈఎస్ఐ చుట్టూ నెలలతరబడి తిరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేదు. గతేడాదిగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. సుమారు నాలుగు వేల మంది రోగులు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకుని ఏడాది గడిచినా బిల్లులు రాలేదు. వీళ్లలో ఎక్కువ మంది గుండె సంబంధిత సమస్యలు, న్యూరో, గ్యాస్ట్రిక్ జబ్బులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుని అప్పులు చేసి మరీ బిల్లులు చెల్లించిన వారే. చిరుద్యోగులకు ఈఎస్ఐ దెబ్బ నెలకు రూ. 15 వేల లోపు వేతనం వచ్చే చిరుద్యోగులే ఈఎస్ఐ ఆస్పత్రులకు వస్తారు. వీళ్లలో సుమారు 7 లక్షల మంది హైదరాబాద్‌లోనే ఉన్నారు. మరో 5 లక్షలు ఏపీలోనూ, 2 లక్షల మంది తెలంగాణ జిల్లాల్లోనూ ఉన్నారు. వీళ్లతో పాటు వీరి కుటుంబ సభ్యులకూ ఈఎస్ఐ ఉచితంగా వైద్యమందించాలి. ఒకవేళ ఈఎస్ఐ ఆస్పత్రిలో సరైన వైద్యసేవలు లేకపోతే ప్రైవేటుకు వెళ్లేందుకు అనుమతిస్తారు. ఆ డబ్బు ఈఎస్ఐ చెల్లించాల్సి ఉంటుంది. కానీ వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అప్పులు చేసి వైద్యం చేయించుకున్నారు. వాటికి సంబంధించిన బిల్లులు చెల్లించడానికి మాత్రం ఈఎస్ఐ తాత్సారం చేస్తోంది. కాగా, ఈఎస్ఐ డెరైక్టరేట్లకు వచ్చే నిధులను ఆయా ఆస్పత్రులకు మందులు సరఫరా చేసే బడా డిస్ట్రిబ్యూటర్లు గద్దల్లా తన్నుకుపోతున్నారు. రోగుల శాతాన్ని బట్టి 65 శాతం నిధులు తెలంగాణకు, 35 శాతం ఏపీకి కేటాయించారు. ఈ నిధులను ఎప్పటికప్పుడు సరఫరాదారులు తన్నుకుపోతుండటంతో రోగులకు ఈఎస్ఐ రీయింబర్స్మెంట్ చెల్లించలేకపోతుంది. తాజాగా తెలంగాణలో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఫోన్ చేసి రెండు ఫార్మా కంపెనీలకు ఆర్డరు ఇప్పించుకోగలిగారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. అధికారులు కూడా కమీషన్లకు కక్కుర్తిపడి ఆస్పత్రుల శ్రేయస్సును కూడా గాలికొదిలేసి సరఫరాదారుల సేవలో తరిస్తున్నారు. ఈఎస్ఐ పరిధిలో ఉద్యోగుల వివరాలు ఈఎస్ఐ పరిధిలో ఉన్న తెలంగాణ ఉద్యోగులు : 9 లక్షలు వారి కుటుంబ సభ్యులు : 27 లక్షలు ఈఎస్ఐ పరిధిలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులు : 5 లక్షలు వారి కుటుంబ సభ్యులు : 16 లక్షలు -
పేరుకే ఈఎస్ఐ ఆస్పత్రి
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఏర్పాటు చేసిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఈఎస్ఐ)కార్మికుల ఆరోగ్య బీమా ఆస్పత్రి ఆశించిన ఫలి తాన్ని ఇవ్వడం లేదు. చిక్సిత కోసం వచ్చే కార్మికులకు ఇక్కడ సకాలంలో వై ద్య చికిత్సలు అందక పోవడంతో ప్రై వేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో విధుల్లో ఉండే వైద్యులు కేవలం సంతకాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విధు ల్లో ఉండాల్సిన వైద్యులు తమ ప్రైవే టు ఆస్పత్రులకే పరిమితమవుతున్నా రు. ప్రజాప్రతినిధుల అండదండలతో విధులకు ఎగనామం పెడుతున్నట్లు ఆ రోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కో ట్ల రూపాయలతో నిర్మించిన ఆస్పత్రి భవనం నిరుపయోగంగా మారింది. ఆస్పత్రిలో గతంలో ఉన్న పరికరాలను ఇతర ప్రాంతాలకు తరలించడంతో మెరుగైన వైద్య సేవలు అందడం లేవు. దీంతో ఆస్పత్రిలోని గదులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కార్మికుల కోసం ఏర్పాటు.. జిల్లావ్యాప్తంగా వివిధ రంగాల్లో కార్మికులుగా ఉన్న వారి ఆరోగ్య పరిరక్షణ కోసం 2000 సంవత్సరంలో అప్పటి ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి జిల్లాకేంద్రంలోని న్యాలకల్ రోడ్డులో ఈఎస్ఐ ఆస్పత్రిని ప్రారంభించారు. ఆస్పత్రిలో సుమారు 10వేలకు పైగా కార్మికులు సభ్యులుగా (కార్డులు) పొందారు. వీరికి సేవలు అందించేందుకు ఇన్పేషంట్లకు 50 పడకలను ఏర్పాటు చేశారు. వారికి మెరుగైన వైద్య సేవలందించేందుకు వివిధ రకాల పరికరాలను సైతం ఆస్పత్రిలో అమర్చారు. కాని వైద్యులు రోగులకు వైద్య సేవలందించడంలో విఫలమవడంతో వాటిని ఇతర ప్రాం తాలకు తరలించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో .. ఈఎస్ఐ ఆస్పత్రికి కేంద్ర ప్రభుత్వం నిధులను మొదట రాష్ట్ర ప్రభుత్వానికి మంజూరు చేస్తుం ది. రాష్ట్ర ప్రభుత్వం తన నిధులతో కలిపి ఆస్పత్రికి విడుదల చేస్తుంది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ నిధులను మింగేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. వేధిస్తున్న వైద్యుల కొరత.. ఆస్పత్రిలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. వైద్యులతో పాటు సిబ్బంది సైతం తక్కువగానే ఉన్నారు. గతంలో 30 మంది సిబ్బంది ఉండ గా, వారిలో నుంచి 15 మందిని తొలగించినట్లు తెలిసింది. వివిధ విభాగాల కు సంబంధించి సుమారు 50 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 8 మంది మాత్రమే ఉన్నా రు. వీరు కూడా కేవలం సంతకాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలున్నాయి.ఆస్పత్రి నిర్వహణను పర్యవేక్షించాల్సిన సూపరింటెం డెంట్ తన స్వంత నర్సింగ్‌హోంను నడుపుకోవడానికి సమయాన్ని కేటాయిస్తారు. అడపాడపా ఆస్పత్రికి వచ్చి కేవలం సంతకం మాత్రమే చేసి వెళ్లిపోతారనే ఆరోపణలు ఉన్నాయి. ఏళ్ల తరబడి కొనసాగింపు.. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని నడుపుతున్న వైద్యుడు ఈఎస్ఐ ఆస్పత్రికి సూపరింటెండెంట్‌గా కొనసాగుతున్నారు. ఆయనపై గతంలో పలు ఆరోపణలు రావడంతో ఆయనను కొన్ని రోజులు ఇక్కడి నుంచి వేరో చోటకి బదిలీ చేసినట్లు తెలిసింది. అయితే ప్రజాప్రతినిధిల అం డదండలతో ఆయన తిరిగి ఇక్కడే పోస్టింగ్‌ను వేయించుకున్నట్లు కార్మిక నాయకులు, కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆస్పత్రికి వచ్చే నిధులను ఆయన తన ఖాతాలోకే జమ చేసుకుంటున్నాడని వారు ఆరోపించారు.