ఉద్యోగులందరూ ఈఎస్‌ఐకు అర్హులే | Employees are eligible to ESI | Sakshi
Sakshi News home page

ఉద్యోగులందరూ ఈఎస్‌ఐకు అర్హులే

Published Sat, Jul 4 2015 1:17 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

ఉద్యోగులందరూ ఈఎస్‌ఐకు అర్హులే - Sakshi

ఉద్యోగులందరూ ఈఎస్‌ఐకు అర్హులే

హోదాతో పనిలేదు హైకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఏదైనా కంపెనీ లేదా సంస్థలో పని చేస్తున్న ప్రతి వ్యక్తీ(అతను ట్రైనీ అయినప్పటికి), హోదాతో నిమిత్తం లేకుండా ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్(ఈఎస్‌ఐ) కింద లభించే అన్ని ప్రయోజనాలు పొందేందుకు అర్హుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తులు జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ ఎస్.వి.భట్, జస్టిస్ ఎ.శంకర నారాయణ, జస్టిస్ అనిస్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పునిచ్చింది.  
 
ఆర్‌సీసీ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేసే ట్రైనీ ఈఎస్‌ఐ కింద లభించే ప్రయోజనాలను పొందేందుకు అర్హుడేనని ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కోర్టు 1997లో తీర్పు చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆర్‌సీసీ లిమిటెడ్ హైకోర్టులో 1998లో పిటిషన్ దాఖలు చేసింది. మొదట ఈ వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారించి, ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనానికి నివేదించారు. ఆ తరువాత విచారణ చేపట్టిన ధర్మాసనం, దీనిని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి నివేదించింది. ఆ తరువాత విస్తృత ధర్మాసనం ఈ వ్యవహారాన్ని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. దీంతో విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement