సుభాష్‌నగర్, న్యూస్‌లైన్ : ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులతో హడలెత్తించడంతోపాటు, పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చే వ్యాపారులకు అవగాహన సదస్సులు నిర్వహించి పన్ను చెల్లించే విధంగా చైతన్యపరిచారు. పన్నులు ఎగ్గొట్టేవారిని గుర్తించి వారి సంస్థలపై దాడులు సైతం నిర్వహించారు. ఈ నేపథ్యంలో వారు ఆశించిన దాని కంటే అదనంగా ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. అదే విధంగా వాణిజ్య పన్నులశాఖ అధికారులు సైతం పన్నులు ఎగొట్టే వ్యాపారులకు నోటీసులు జారీ చేసి గడువులోపు తమ టార్గెట్ ను పూర్తి చేసుకున్నా రు. ఆన్‌లైన్ విధానం రావడంతో పన్నులు ఎగ్గొడుతున్న వ్యాపారులను గుర్తించి వారికి నేరుగా నోటీసులు జారీచేశారు. దీని ద్వారా వారి వద్ద నుంచి ఆశించిన మేర పన్నులను వసూలు చేశారు.
గత ఏడాది కంటే అధికం
గత ఏడాది జిల్లాలో ఆదాయపు పన్ను శాఖకు సుమా రు రూ. 18 కోట్ల మేర లక్ష్యం నిర్దేశించగా, 31మార్చి 2013 నాటికి సుమారు రూ. 28 కోట్ల మేరకు ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. 2013-2014 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.23 కోట్ల లక్ష్యం కాగా, 31మార్చి 2014 నాటికి రూ.35 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. జిల్లా ఆదాయపు శాఖ పరిధిలో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు వస్తాయి. అదే విధంగా వాణిజ్యపన్నుల శాఖకు గతేడాది రూ. 458.37 కోట్లు ఆదాయం రాగా, ఈ ఏడాది మార్చి31 వరకు రూ.516 కోట్లు ఆదాయం సమకూరింది. జిల్లా వాణిజ్యశాఖ పరిధిలోకి మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్ వస్తాయి. అంటే గతేడాది కన్న ఈ ఏడాది సు మారు 13 శాతం అదనంగా పన్నులు వసూలయ్యా యి. ఒక్క మార్చిలోనే వాణిజ్య పన్నుల శాఖకు రూ.71 కోట్ల మేరకు ఆదాయం సమకూరింది. గత మార్చిలో మాత్రం రూ.51 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. గత మార్చితో పోల్చితే ఈ ఏడాది రూ.20 కోట్లు ఆదాయం అదనంగా సమకూరింది. ఇది కూడా వ్యాట్ ద్వారా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
టార్గెట్ పూర్తయినా దాడులు ఆపం
2013-2014 వార్షిక సంవత్సరంతో తమ శాఖలకు నిర్దేశించిన టార్గెట్లు పూర్తయినప్పటికీ దాడులను ఆపబోమని ఆదాయపు పన్నుల శాఖాధికారులు పేర్కొన్నారు. ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే పన్ను చెల్లించని వ్యాపారులపై నిఘా పెడతామన్నారు. అలాంటి వారిని గుర్తించి దాడులు చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా వాణిజ్యపన్నుల శాఖాధికారులు సైతం ఆదాయాన్ని రాబట్టుకోవడానికి వ్యాపారులకు అవగాహనతో పాటు నోటీసులు జారీచేసి పన్నులు రాబట్టుకుంటామన్నారు.
కష్టానికి ఫలితం
Published Mon, Apr 14 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 5:59 AM
Advertisement
Advertisement