విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి పనాస్‌పూట్ పంచాయతీ డబలగూడ గ్రామంలో ఒక యువతి పాముకాటుతో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి గ్రామంలో రాందాస్ హంతాల్ కుమార్తె షకీల(20) ఇంటి బయట నిద్రపోయింది. అయితే అర్థరాత్రి 2 గంటల సమయంలో తనను ఏదో జంతువు కాటువేసినట్లు తెలియడంతో పెద్దగా కేకలు వేస్తూ లేచింది. వెంటనే చుట్టుపక్కల చూడగా ఒకపాము పక్కనే ఉన్నటువంటి గోతిలోకి వెళ్లడం గమనించారు.
దీంతో హుటాహుటిన జోడాంబ్‌లో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జోడాంబ్ పోలీసులు కేసు నమోద్ చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి శనివారం తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment