న్యూఢిల్లీ: భారత్‌లో పాము కాటు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. విష సర్పాల కారణంగా దేశంలో ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మేరకు పాముకాటు మరణాలపై బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ లోక్‌సభలో మాట్లాడుతూ.. దేశంలో ప్రతి ఏటా పాము కాటు వల్ల 50 వేల మంది మరణిస్తున్నారని బిహార్ బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ వెల్లడించారు. ప్రపంచంలోనే పాము కాటు వల్ల మరణిస్తున్న వారిలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు.
ఆయన మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఏటా 30 నుంచి 40 లక్షల మంది ప్రజలు పాము కాటుకు గురవుతున్నారు. అందులో 50 వేల మంది మరణిస్తున్నారు. ఇది ప్రంపంచలోనే అత్యధికం’అని పేర్కొన్నారు. అదే విధంగా బిహార్ చాలా పేద రాష్ట్రమని, పేదరికంతోపాటు సహజంగా వాతారవణ మార్పులు సైతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. ఇది ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు
మరోవైపు వేలూరు ఎంపీ ఎం.కతీర్ ఆనంద్ .. బీడీ కార్మికుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. బీడీ కార్మికుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నారన్నారు. కేంద్రం నిధులు సరిపోవడం లేదని, వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులు దుమ్ము, ఇతర వృత్తిపరమైన ప్రమాదాలకు గురికావడాన్ని గమనించి బడ్జెట్ కేటాయింపుల్లో పరిగణనలోకి తీసుకుని 60 ఏళ్లు పైబడిన వారికి పెన్షన్ అందించాలని కేంద్రాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment