
ఉత్తరప్రదేశ్:ఉత్తరప్రదేశ్‌లో ఓ బాలుడు(3) పాముని చూయింగ్ గమ్‌లా నమిలి చంపేశాడు. ఈ ఘటన ఫరూకాబాద్‌లో జరిగింది. బాలుడు తన నానమ్మతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆరుబయట ఆడుకుంటుండగా.. పొదలలో నుంచి ఓ పాము అతని వద్దకు వచ్చింది.
బాలుడు దాన్ని చేతితో పట్టుకుని నోటితో నమిలేశాడు. ఆ తర్వాత ఆరవడం మొదలుపెట్టాడు. బయటకు వచ్చిన అతని నానమ్మ ఒక్కసారిగా బయపడింది.పామును బాలుని నోటి నుంచి బయటకు లాగి విసిరేసింది. అప్పటికే బాలుడు సృహతప్పి పడిపోయాడు. బాధితుని నానమ్మ బంధువుల సహాయంతో బాలున్ని ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు తక్షణం స్పందించి చికిత్స అందించారు. బాలుని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:బంతిని పట్టుకున్నాడని.. దళిత వ్యక్తి వేలు కోసేశారు..
Comments
Please login to add a commentAdd a comment