Farrukhabad
-
పామును చూయింగ్ గమ్‌లా నమిలేశాడు..!
ఉత్తరప్రదేశ్:ఉత్తరప్రదేశ్‌లో ఓ బాలుడు(3) పాముని చూయింగ్ గమ్‌లా నమిలి చంపేశాడు. ఈ ఘటన ఫరూకాబాద్‌లో జరిగింది. బాలుడు తన నానమ్మతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆరుబయట ఆడుకుంటుండగా.. పొదలలో నుంచి ఓ పాము అతని వద్దకు వచ్చింది. బాలుడు దాన్ని చేతితో పట్టుకుని నోటితో నమిలేశాడు. ఆ తర్వాత ఆరవడం మొదలుపెట్టాడు. బయటకు వచ్చిన అతని నానమ్మ ఒక్కసారిగా బయపడింది.పామును బాలుని నోటి నుంచి బయటకు లాగి విసిరేసింది. అప్పటికే బాలుడు సృహతప్పి పడిపోయాడు. బాధితుని నానమ్మ బంధువుల సహాయంతో బాలున్ని ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు తక్షణం స్పందించి చికిత్స అందించారు. బాలుని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి:బంతిని పట్టుకున్నాడని.. దళిత వ్యక్తి వేలు కోసేశారు.. -
దారుణం : మతిభ్రమించిన మహిళపై రాళ్ల దాడి
ఫరూఖాబాద్ : ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మతి భ్రమించిన ఓ మహిళపై ఇద్దరు యువకులు దాడి చేశారు. మానసిక రోగి, అందులోనూ ఓ మహిళ అని చూడకుండా జుట్టు పట్టి లాగుతూ కిరాతకంగా దాడి చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ సంఘటనను కొందరు మొబైల్ ఫోన్లలో రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మతి భ్రమించిన ఓ మహిళ ఆకలితో ఫరూఖాబాద్‌లోని తిర్వా కాలనీకి వెళ్లింది. ఏం జరిగిందో తెలియదు కానీ, ఇద్దరు యువకులు మహిళపై రాళ్లదాడి చేశారు. ఆమె జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. మహిళ ఏడుస్తున్నా విడిచిపెట్టకుండా పిడి గుద్దులు గుద్దారు. చివరకు స్థానికులు వచ్చి విడిపించడంతో ఆ యువకులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు.. తీవ్ర గాయాలతో పడిఉన్న మహిళలను ఆస్పత్రికి తరలించారు. నిందితులను కుత్రా మండేయ గ్రామానికి చెందిన బాబా యాదవ్, విపిన్ రాజ్‌పుత్‌గా గుర్తించారు. మహిళ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశామని, ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. -
పోలీసుల చేతిలో భర్త.. గ్రామస్తుల దాడిలో భార్య!
ఫరూఖాబాద్(యూపీ): పుట్టినరోజు అంటూ 23 మంది చిన్నారులను పిలిచి బంధించిన వ్యక్తిని పోలీసులు గురువారం అర్ధరాత్రి హతమార్చగా, తప్పించుకునేందుకు ప్రయత్నించిన అతని భార్య.. గ్రామస్తుల చేతిలో చనిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా కసారియా గ్రామంలో జరిగిందీ ఘటన. చిన్నారులను బందీగా చేపట్టి, వారిని చంపేస్తామని బెదిరిస్తూ.. ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన సంచలన ఘటన చివరకు సుఖాంతమైంది. సుభాష్ బాథమ్(40)పై గతంలో హత్య కేసు ఉంది. బెయిల్‌పై బయటకు వచ్చాడు. కూతురి పుట్టిన రోజు వేడుకులకు రావాలంటూ గురువారం గ్రామంలోని చిన్నారులను తన ఇంటికి పిలవగా 23 మంది పిల్లలొచ్చారు. అందర్నీ ఇంటి బేస్మెంట్లో బంధించాడు. హత్య కేసును వెనక్కి తీసుకుంటామని, ప్రభుత్వ ఇల్లు ఇస్తామని నచ్చజెప్పేందుకు యత్నించినా సుభాష్ వినలేదని డీజీపీ ఓపీ సింగ్ చెప్పారు. సుభాష్ జరిపిన కాల్పుల్లో 8 మంది పోలీసులకు, ఒక గ్రామస్తుడికి గాయాలయ్యాయన్నారు. ఇంటి వెనుకవైపు నుంచి తలుపు బద్ధలు కొట్టి పోలీసులు లోపలికి వెళ్లారు. వారిపై సుభాష్ కాల్పులు జరపగా ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. తర్వాత పిల్లలందరినీ పోలీసులు రక్షించారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన సుభాష్ భార్య రూబీను గ్రామస్తులు తీవ్రంగా కొట్టారు. గాయాలతో ఆమె ఆసుపత్రిలో మరణించింది. సుభాష్ ఇంటి నుంచి పోలీసులు తుపాకిని, రైఫిల్‌ను, రెండు డజన్ల కాట్రిడ్జ్‌లను, 25 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే పిల్లలను బందీలుగా ఉంచుకునే ఆలోచనలో ఆ దంపతులు ఉన్నట్లు అర్థమవుతుందని పోలీసులు చెప్పారు. -
కారిడార్లోనే ప్రసవం.. రక్తపు మడుగులో..
సాక్షి, ఫరూఖాబాద్: పురిటినొప్పులతో ఆసుపత్రి వెళ్లిన మహిళకు నరకం చూపించారు అక్కడి వైద్యులు. కనీసం ఆమెకు ఓ బెడ్ కూడా కేటాయించకపోవటంతో ఆసుపత్రి కారిడార్‌లో అందరి ముందు శిశువుకు జన్మనిచ్చింది. ఒకవైపు ప్రసవ వేదన, మరోవైపు మానసిక క్షోభను అనుభవించిందా మహిళ. ఈ దయనీయ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో జరిగింది. ఓ నిండు గర్భిణీ ఆదివారం ఫరూఖాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు, సిబ్బంది బెడ్స్ ఖాళీగా లేవంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పురిటి నొప్పులు తీవ్రతరమైన మహిళ ఆసుపత్రి కారిడార్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె బంధువు అప్పుడే పుట్టిన శిశువును చేతిలోకి తీసుకుని బట్టలో చుట్టింది. కాగా రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి సెల్ఫోన్లో చిత్రీకరించి... స్థానిక జర్నలిస్టులకు సమాచారమివ్వడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఆమెకు జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ఎంత ఘోరం జరిగి ఉండేదని ఉన్నతాధికారులు ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సుమోటో కింద కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు జరగడం మొదటిసారి కాదు. ఈ ఏడాదిలోనే ఓ మహిళ ఆసుపత్రికి వెళ్లగా అక్కడి నర్సులు బయటికి పంపించేయడంతో రోడ్డు మీదే ప్రసవించింది. 2017లో కూడా ఆక్సిజన్ అందక ఒకే నెలలో 49 మంది శిశువులు మరణించిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి!
ఫరూఖాబాద్: ఆయనో ఎమ్మెల్యే. అందరూ రాజకీయ నాయకుల్లా కాకుండా మంచి మనసుతో తన ప్రత్యేకత చాటుకున్నారు. మానవత్వం ప్రదర్శించి అందరి మన్ననలు అందుకున్నారు. ఆపదలో ఉన్న వారిని సరైన సమయంలో ఆదుకుని నిజమైన ప్రజా సేవకుడిగా నిలిచారు. ఎవరూ ఊహించని విధంగా క్షతగాత్రులను తన వీపుపై మోసి అందరి హృదయాలను గెలిచారు. ఆయన పేరు మెజొర్ సునీల్ దత్ ద్వివేది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లా సర్దార్ శాసనసభ నియోజకవర్గానికి బీజేపీ తరపున ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఫరూఖాబాద్-ఫతేగఢ్ మార్గంలో ద్వివేది తన వాహనంలో ఇంటికి వెళుతుండగా ఓ హృదయ విదారక దృశ్యం ఆయన కంటపడింది. భీంసేన్ మార్కెట్ సమీపంలో ముగ్గురు వ్యక్తులు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో రోడ్డు మధ్యలో పడివున్నారు. వీరిని గమనించిన ఆయన వెంటనే తన కారును ఆపి, క్షతగాత్రుల దగ్గరకు వెళ్లారు. తన అనుచరుల సహాయంతో గాయపడిన ముగ్గురిని తన కారులో సమీపంలోని లోహియా ఆస్పత్రికి తరలించారు. స్ట్రెచర్లు అందుబాటులో లేకపోవడంతో ద్వివేది స్వయంగా ఒక క్షతగాత్రుడిని వీపుపై మోసుకెళ్లి అత్యవసర విభాగంలో చేర్చారు. క్షతగాత్రులు అరవింద్ సింగ్ చౌహాన్, రిషబ్, రామేశ్వర్ సింగ్‌గా గుర్తించారు. గాయపడిన వారిని సకాలంలో ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే ద్వివేదిని అక్కడున్నవారంతా మనసారా అభినందించారు. ఎమ్మెల్యే అంటే ఇలావుండాలని ప్రశంసించారు. -
యూపీలో మరో గోరఖ్‌పూర్!
ఫరూఖాబాద్‌లో నెల రోజుల్లో 49 మంది నవజాత శిశువుల మృతి ఫరూఖాబాద్/లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రభుత్వాసుపత్రిలో చిన్నారుల మరణ మృదం గాన్ని మరవకముందే.. అదే రాష్ట్రంలోని ఫరూఖాబాద్ లోనూ అలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫరూఖాబాద్ జిల్లా ఆస్పత్రిలో గత నెల రోజుల వ్యవధిలో సుమారు 49 మంది నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. చాలా మంది చిన్నారులు ‘పెరినటల్ అస్ఫిక్సియా’ (ఊపిరి తీసుకోవడం కష్టమవడం) వల్లే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 30 మంది నెల రోజుల వయసున్న చిన్నారులు, మరో 19 మంది శిశువులు డెలివరీ సమయంలో మృతి చెందారు. ఈ మరణాలన్నీ జూలై 20 నుంచి ఆగస్టు 21 మధ్య సంభవించాయి. దీంతో ఫరూఖాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) ఉమాకాంత్ పాండే, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) అఖిలేశ్ అగర్వాల్‌లను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. సీఎంవో, సీఎంఎస్‌లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ‘శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల వల్లే చిన్నారులు మృతి చెందారు. అయితే, ఆక్సిజన్, మందులు అందించడంలో అధికారులు ఆలస్యం చేశారని, ఆక్సిజన్ సరిగ్గా సరఫరా చేయకపోవడం వల్లే తమ పిల్లలు చనిపోయారని బాధిత తల్లిదండ్రులు చెప్పారు’ అని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో జిల్లా మేజిస్ట్రేట్ పేర్కొన్నారు. కాగా, గత 24 గంటల్లో గోరఖ్‌పూర్ బీఆర్డీ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 24 మంది చిన్నారులు మరణించారని అధికారులు తెలిపారు. మరోవైపు రాజస్తాన్‌లోని బన్స్వారా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో గత రెండు నెలల్లో 90 మంది చిన్నారులు మృతి చెందడంతో ప్రభుత్వం ముగ్గురు వైద్యుల్ని సస్పెండ్ చేసింది. -
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం
ఉత్తరప్రదేశ్: గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో నెల రోజుల వ్యవధిలో వందల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశ ప్రజల్ని తీవ్రంగా కలచివేసిన విషయం తెలిసిందే. ఈ దారుణం మరవకముందే మరో విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు నెలలో ఫరూఖాబాద్‌లోని రామ్ మనోహర్ లోహియా జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్, మందుల కొరతతో సుమారు 49 మంది చిన్నారులు చనిపోయారని అధికారులు వెల్లడించారు. దీంతో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌తో సహా మొత్తం మగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సీ దయానంద్ మిశ్రా తెలిపారు. ఆక్సిజన్ అందక చనిపోయిన పిల్లల్లో ఎక్కువగా అప్పుడే జన్మించిన వారే ఉండటం విశేషం. జిల్లా మెజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ దర్యాప్తు బృదం ఆస్పత్రికి వెల్లడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఆస్పత్రి వర్గాలను జిల్లా మెజిస్ట్రేట్ సమగ్ర నివేదికను ఇవ్వాలని కోరారు. చిన్నారుల తల్లిదండ్రులు ఆక్సిజన్, మందుల సరఫరా కొరతపై ఫిర్యాదు చేశారు. -
యూపీలోనే మరో గోరఖ్‌పూర్ ఘటన
-
యూపీలోనే మరో గోరఖ్‌పూర్ ఘటన
సాక్షి, యూపీ: గోరఖ్‌పూర్ చిన్నారుల మృత్యు ఘోష కళ్ల ముందు కదలాడుతుండగానే ఇప్పుడు వరుసగా అలాంటి ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. జార్ఖండ్ లో మొన్నీమధ్యే ఎంజీఎం ఆస్పత్రిలో పౌష్టికాహర లోపంతో 52 మంది చిన్నారులు చనిపోగా, తాజాగా ఉత్తర ప్రదేశ్ లోనే మరో ఆస్పత్రిలో 49 మంది పిల్లలు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఫర్రూఖాబాద్‌లోని రామ్ మనోహర్ లోహియా ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. నెల రోజుల వ్యవధిలో 49 మంది పిల్లలు చనిపోయారు. వీరిలో అప్పుడే పుట్టిన 19 మంది శిశువులు ఉండటం శోచనీయం. ఆక్సిజన్ సరఫరా లేమి, మందుల కొరత ఇందుకు కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సకాలంలో సిబ్బంది స్పందించలేదన్న తల్లిదండ్రుల ఆరోపణలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎఫ్ఐఆర్లో మెడికల్ ప్రధానాధికారితోపాటు, పలువురి వైద్యుల పేర్లను నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని ఫర్రూఖాబాద్ ఎస్పీ దయానంద్ మిశ్రా తెలిపారు. -
తన భార్యను వేధిస్తున్నాడని..
కాన్పూర్: తన భార్యను వేధిస్తున్నాడని తండ్రిపై కొడుకు తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లాలో కలకలం రేపింది. శంషాబాద్ పోలీసు స్టేషన్ లోని పరిధిలోని ఇదంపూర్ తామరాయ్ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. నిరంతరం తన భార్యను లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆగ్రహంతో అమిత్(28) తన తండ్రి రతిరామ్(50)పై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో కోడలి పట్ల రతిరామ్ అసభ్యంగా ప్రవర్తించడంతో అమిత్ నాటు తుపాకీతో కాల్పులు జరిపినట్టు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన రతిరామ్ ను ఖయామ్ గంజ్ కమ్యునిటీ ఆస్పత్రికి తరలించారు. తర్వాత అతడిని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అమిత్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అమిత్ తమ్ముడు అనుజ్ ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అమిత్ ను జైలుకు తరలించారు.