తన భార్యను వేధిస్తున్నాడని.. | Son shoots at father for molesting his wife | Sakshi
Sakshi News home page

తన భార్యను వేధిస్తున్నాడని..

Published Mon, Sep 26 2016 7:26 PM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM

తన భార్యను వేధిస్తున్నాడని.. - Sakshi

తన భార్యను వేధిస్తున్నాడని..

కాన్పూర్: తన భార్యను వేధిస్తున్నాడని తండ్రిపై కొడుకు తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లాలో కలకలం రేపింది. శంషాబాద్ పోలీసు స్టేషన్ లోని పరిధిలోని ఇదంపూర్ తామరాయ్ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. నిరంతరం తన భార్యను లైంగికంగా వేధిస్తున్నాడన్న ఆగ్రహంతో అమిత్(28) తన తండ్రి రతిరామ్(50)పై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు.

మద్యం మత్తులో కోడలి పట్ల రతిరామ్ అసభ్యంగా ప్రవర్తించడంతో అమిత్ నాటు తుపాకీతో కాల్పులు జరిపినట్టు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన రతిరామ్ ను ఖయామ్ గంజ్ కమ్యునిటీ ఆస్పత్రికి తరలించారు. తర్వాత అతడిని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అమిత్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అమిత్ తమ్ముడు అనుజ్ ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అమిత్ ను జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement