పాము కాటుతో మహిళా పోలీసు మృతి | female police officer died to snake bite | Sakshi
Sakshi News home page

పాము కాటుతో మహిళా పోలీసు మృతి

Published Sun, Aug 20 2023 10:41 AM | Last Updated on Sun, Aug 20 2023 10:42 AM

female police officer died to snake bite - Sakshi

శ్రీకాకుళం: మండలంలోని తర్లిపేట సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్‌)గా పనిచేస్తున్న తామాడ జ్యోతికుమారి (36) పాముకాటుతో మృతిచెందారు. సంత»ొ మ్మాళి మండలం కాపుగోదాయవలస గ్రామానికి చెందిన తామాడ జ్యోతికుమారి తన తండ్రి రిటైర్డ్‌ వీఆర్‌ఓ తామాడ రామారావు ఇంటిలో ఉంటున్నారు. శుక్రవారం బాత్‌రూమ్‌ నుంచి బయటకు వ స్తుండగా పాము కాటు వేసింది.

వెంటనే కు టుంబ సభ్యులు ఆమెను ఆటోపై కోట»ొ మ్మాళి సామాజిక ఆస్పత్రికి తరలిస్తుండగా జ్యోతికుమారి మార్గం మధ్యలోనే మృతి చెందారు. ఆమెకు భర్త జయరాజ్, కుమారుడు రఘునాథ్‌ ఉన్నారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె మృతిపై తర్లిపేట సచివాలయ సిబ్బంది వి.రమే‹Ù, డి.అప్పన్న, ఎం.మాధురి, టి.రాము, వై.సింహాద్రి, హెచ్‌.మహందాత, బి.భాను తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement