సాక్షి, హైదరాబాద్:మందుబాబులను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. డ్రంకన్ డ్రైవ్‌లో చిక్కిన వారి కుటుంబ సభ్యులను పిలిపించి మందలించే పోలీసులు.. తాజాగా డ్రంకన్ డ్రైవ్‌లో చిక్కిన ఇద్దరు మందుబాబులు పని చేస్తున్న కంపెనీలకు ఉద్యోగుల ఘనకార్యాన్ని తెలుపుతూ రాచకొండ ట్రాఫిక్ పోలీసులు లేఖ రాశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా రోడ్డు భద్రతపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలని ఆ లేఖలో సూచించారు కూడా. ఈ నెల 18 నుంచి 24 వరకు మధ్య రాచకొండ పరిధిలో 413 మందిపై డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
రూ.8,47,500 జరిమానా విధించారు. వీరిలో 20 మందికి సంబంధిత కోర్ట్‌లు జైలు శిక్షను విధించాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించిన 34,042 మందిపై కేసులు నమోదు చేశారు. వీరికి రూ.1,37,28,710 జరిమానా విధించారు. వీటిలో అత్యధికం హెల్మెట్ లేని కేసులే. 19,866 విత్‌ఔట్ హెల్మెట్ కేసులు కాగా.. వీరికి రూ.36,45,300 జరిమానా విధించారు. వారం రోజుల వ్యవధిలో రాచకొండ పరిధిలో వంద రోడ్డు ప్రమాద కేసులయ్యాయి. వీటిల్లో 15 మంది మరణించగా.. 88 మందికి గాయాలయ్యాయి.
చదవండి: కుట్ల నొప్పి తట్టుకోలేని తల్లి.. ఉరినే భరించింది!
Comments
Please login to add a commentAdd a comment