Hyderabad: గంజాయి సరాఫరా.. మహిళా డ్రగ్‌ పెడ్లర్లపై పీడీ యాక్ట్‌ | Hyderabad Police Invoke PD Act On Women drug peddlers | Sakshi
Sakshi News home page

Hyderabad: అక్రమంగా గంజాయి సరాఫరా.. ఇద్దరు మహిళా డ్రగ్‌ పెడ్లర్లపై పీడీ యాక్ట్‌

Published Wed, Oct 26 2022 1:08 PM | Last Updated on Wed, Oct 26 2022 1:15 PM

Hyderabad Police Invoke  PD Act On Women drug peddlers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ ముఠాలో సభ్యులుగా ఉన్న ఇద్దరు మహిళా పెడ్లర్లపై రాచకొండ పోలీసులు మంగళవారం పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో 8 మంది నిందితులపై పీడీ చట్టం ప్రయోగించిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన ప్రధాన డ్రగ్‌ పెడ్లర్‌ ఆకాశ్‌ కుమార్‌ ఆదేశాల మేరకు ముఠా సభ్యులు సాయినాథ్‌ చౌహాన్, అతడి భార్య రవళి, ఆమె స్నేహితురాలు సంగీత, షేక్‌ నవాజుద్దీన్, వినాయక్, బానావత్‌ కిషన్, బానావత్‌ నాగలు రెండు కార్లలో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన రాజు, సంసాయిరావు, నుంచి 480 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు.

హైదరాబాద్‌ మీదుగా కర్ణాటకకు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న హయత్‌నగర్‌ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో రవళి, సంగీతలపై హయత్‌నగర్‌ పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement