
‘నకిలీ మిరప’లో అధికారుల పాత్రపై విజిలెన్‌స
► వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల సహా కమిషనరేట్‌లో విచారణ
► కంపెనీలకు లెసైన్సులు జారీ చేసిన అధికారులపై ఆరా
సాక్షి, హైదరాబాద్: నకిలీ మిరప విత్తనాలను రైతులకు అంటగట్టిన కంపెనీలు, డీలర్లపై చర్యలకు దిగిన ప్రభుత్వం... ఇప్పుడు జిల్లాల్లో వ్యవసాయాధికారులు, కమిషన రేట్‌లోని ఉన్నతస్థాయి అధికారుల పాత్రపై ఆరా తీస్తోంది. ఈ మేరకు నిఘా విభాగం (విజిలెన్‌స) విచారణ చేస్తున్నట్లు తెలిసింది. నకిలీ మిరప విత్తనాలను సరఫరా చేశారన్న కారణంతో దాదాపు 110 మంది డీలర్ల లెసై న్సులను వ్యవసాయ శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆరుగురిపై పోలీసు లు పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు.
ఆయా కంపెనీల ఫ్యాక్టరీల పరిధిలోని ముగ్గురు వ్యవసాయాధికారులను సస్పెండ్ చేశారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో నకిలీ మిరప విత్తనాలను విక్రయిస్తున్నా ఏమాత్రం పట్టించుకోని వ్యవసాయాధికారుల పాత్రపైనా విజిలెన్‌స తాజాగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఆయా కంపెనీలకు రాష్ట్రస్థాయి లో వ్యవసాయ కమిషనరేట్ స్థారుులో లెసైన్సులు ఎలా జారీచేశారన్న అంశంపైనా నిఘా విభాగం ఆరా తీస్తోంది.
వ్యవసాయాధికారులపైనా చర్యలు?
ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో వేలాది మంది రైతులు నకిలీ మిరప విత్తనాలు వేసి పెద్ద ఎత్తున నష్టపోయారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 72 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. నకిలీ మిరప విత్తనాలపై ప్రభుత్వం వ్యవసాయ సైంటిస్టులు, అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. వారు ఆయా జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. నకిలీ విత్తనాలతో మిరప రైతులు నష్టపోయారని బృందం ప్రభుత్వానికి నివేదించింది. దీంతో ప్రభుత్వం ఇప్పటివరకు 110 మంది డీలర్ల లెసైన్సులు రద్దు చేసింది. ఆరు కంపెనీ యాజమాన్యాలపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసింది.
స్థానికంగా ఉన్న మండల వ్యవసాయాధికారులు కొం దరు నకిలీ విత్తనాలు విక్రరుయించే డీలర్ల నుంచి ముడుపులు పుచ్చుకొని చూసీ చూడ నట్లుగా వదిలేశారన్న ఆరోపణలు న్నాయి. అంతేకాదు రాష్ట్రస్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు నకిలీ విత్తన కంపెనీలకు ఎలా లెసైన్సులు జారీచేశారన్న ప్రశ్న తలెత్తుతోంది. వ్యవసాయశాఖ వైఫల్యం వల్లే నకిలీ మిరప విత్తనాలు రైతుల వద్దకు చేరాయని, దీనికి వ్యవసాయశాఖ బాధ్యత వహించాల్సి ఉం టుందని విజిలెన్‌స అధికారులు చెబుతు న్నారు.
ఈ అంశంలో కొందరు మండల వ్యవ సాయాధికారులపై చర్యలుండే అవకాశం ఉంది. సంబంధిత విత్తన కంపెనీల లెసైన్సు ఫైలు వివిధస్థారుు అధికారుల నుంచి కమిష నరేట్‌లోని ఇద్దరు ముఖ్యమైన అధికారుల ఆమోదం తర్వాతే జారీ అరుు ఉంటుందని అంటున్నారు. లెసైన్సుల జారీలో ఆ ఇద్దరి పాత్ర ఉంటే వారిపైనా చర్యలుంటాయని ఒక అధికారి వ్యాఖ్యానించారు.