మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ రాజుసింగ్‌పై నగర పోలీసులు పీడీ యాక్ట్ విధించారు.
హైదరాబాద్: మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ రాజుసింగ్‌పై నగర పోలీసులు పీడీ యాక్ట్ విధించారు. మంగళ్‌హాట్ ప్రాంతంలో నివసించే రాజుసింగ్‌పై ఒక హత్యకేసుతో పాటు పలు కేసులు ఉన్నాయి. కాగా, ఒక కేసులో చంచల్‌గూడ జైల్లో శిక్ష కూడా అనుభవిస్తున్నాడు. గురువారం పీడీయాక్ట్ ఆదేశాలను చంచల్‌గూడ జైల్లో ఉన్న రాజుసింగ్‌కు జారీ చేసినట్లు తెలిపారు.
పీడీయాక్ట్ విధించడం ద్వారా ఏడాదిపాటు జైల్లోనే ఉండవలసి వస్తుంది. నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ విధిస్తామని ఇన్‌స్పెక్టర్ ఆర్. శ్రీనివాస్ హెచ్చరించారు.