
నిందితుడు కేతవాద్ రాజు
సాక్షి, హైదరాబాద్ : నగరంలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేశారు. నాందేడ్‌కు చెందిన సతీష్ ఉత్తమ్ కుమార్, కేతవాద్ రాజులు నగరంలోని రాజేంద్ర నగర్ ఆప్కో కాలనీలో నివసిస్తున్నారు. సతీష్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. కేతవాద్ రాజు కూలీగా పనిచేస్తున్నాడు. ఈ ఇద్దరు కలిసి రాత్రి వేళలో సంచరిస్తూ.. మారడ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆప్కో, ఆదర్శ్, ముస్తఫా నగర్, టీఎన్‌జీవో, టాటా నగర్, మదుబాన్ కాలనీల్లో తాళాలు వేసిన ఎనిమిది ఇళ్లలోకి చోరబడి 13 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను దొంగలించారు. పగలు రిక్కీ నిర్వహించి రాత్రి వేళలో చోరీలకు తెగబడే వీరిని శుక్రవారం మారేడ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరికి నేరచరిత్ర ఉండటంతో పీడీయాక్ట్ నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.