
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భారీ షాక్ తగిలింది. పీడీ యాక్ట్ ఎత్తేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తి తిరస్కరణకు గురైంది. ఈ మేరకు ఆయనపై నమోదు అయిన పీడీయాక్ట్‌పై బుధవారం అడ్వైజరీ బోర్డు తీర్పు వెలువరించింది.
ఈ కేసును నిశితంగా పరిశీలించి ఇరువర్గాల వాదోపవాదాలు విని విచారణ చేపట్టిన కమిటీ.. పోలీసులు నమోదు చేసిన పీడీ యాక్ట్‌ను సమర్థించింది. అంతేకాదు.. పీడీ యాక్ట్ ఎత్తేయాలన్న రాజాసింగ్ విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో ఆయనకు ప్రతికూలంగా బోర్డు ఇవాళ తీర్పు వెలువరించింది.
రాజాసింగ్‌పై 101 కేసులు ఉన్నాయని, అందులో 18 కేసులు కమ్యూనల్(మత సంబంధిత) ఉన్నాయని పోలీసులు కమిటీకి నివేదించారు. దీంతో హైదరాబాద్ పోలీసుల వాదనతో ఏకీభవించింది అడ్వైజరీ కమిటీ.
Comments
Please login to add a commentAdd a comment