సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నకిలీ విత్తనాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ క్రమంలో నకిలీ విత్తనాలు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.
కాగా, నకిలీ విత్తనాలపై దాడుల నేపథ్యంలో డీజీపీ అంజనీకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 990 కేసులు నమోదు చేశాము. 2014 నుంచి 2022 వరకు 1,932 మందిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. పదేపదే నకిలీ విత్తనాలు అమ్ముతున్న 58 మందిపై పీడీ యాక్ట్ పెట్టినట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే నకిలీ విత్తనాలపై ఎస్పీలు, కమిషనర్లు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment