హైదరాబాద్ : కలప స్మగ్లింగ్, అటవీ భూముల కబ్జాపై పీడీ యాక్ట్తో కేసులు నమోదు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. సోమవారం ఆయన హరితాహారం పథకంపై కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో 24 శాతం అటవీ ప్రాంతముందని, దాన్ని 33 శాతానికి పెంచాలని సూచించారు. సమగ్ర ప్రణాళికతో తెలంగాణవ్యాప్తంగా చెట్ల పెంపకం చేపట్టాలని, సమాజంలోని అన్నివర్గాలను చెట్ల పెంపకంలో భాగస్వామ్యం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీ సిబ్బందికి వాహనాలతో పాటు ఆయుధాలు ఇస్తామని కేసీఆర్ తెలిపారు.
కలప స్మగ్లింగ్, భూముల కబ్జాపై పీడీ యాక్ట్
Published Mon, May 11 2015 6:56 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM
Advertisement