హోసూరు: హోసూరు ప్రాంతంలో మసాజ్ సెంటర్ల పేరుతో వ్యభిచారం జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. గత రెండు నెలలుగా పోలీసులు నిర్వహించిన దాడుల్లో 20 మందికిపైగా నిందితులను అరెస్ట్ చేసి హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. కార్పొరేషన్ పరిధిలోని మసాజ్ సెంటర్ల పేరుతో మహిళలను ఉంచి వ్యభిచారాలు కొనసాగుతున్నాయని సోమవారం రాత్రి డీఎస్పీకి రహస్య సమాచారం అందింది.
దీంతో మసాజ్ సెంటర్లలో పోలీసులు సోదాలు నిర్వహించగా, దీపిక (32), చూడప్ప (40), తులసీరామన్ (21)లు వేశ్యావాటికలు నిర్వహిస్తూ పట్టుబడ్డారు. వీరి వద్ద ఉన్న 7 మంది మహిళలకు విముక్తి కల్పించి అనాథ శరణాలయాలకు తరలించారు. మసాజ్ సెంటర్లపై నిఘా ఉంచి తప్పుడు పనులు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment