విజయవాడ సిటీ : సినీ అవకాశాల కోసం వచ్చిన యువతిని ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దించిన కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితునిగా భావిస్తున్న ప్రముఖ సినీ నిర్మాత కారు డ్రైవర్ మహేంద్ర చౌదరి ప్రధాన అనుచరుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. ఇతని ద్వారా మహేంద్రను అదుపులోకి తీసుకోవడంతో పాటు భీమవరానికి చెందిన విజయ్ ఏలూరులో ఉన్నట్టు గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు రంగంలోకి దిగారు.
ఏలూరుకు చెందిన యువతి సినీ అవకాశాల కోసం వెళ్లి హైదరాబాద్ కృష్ణనగర్‌లోని దళారుల చేతికి చిక్కి వ్యభిచారం చేస్తూ నగరానికి వచ్చి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. ఈ వైనంపై ‘చెదిరిన కల’ శీర్శికన సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనం కలకలం రేపింది. ఈ క్రమంలో శిశు సంక్షేమ వసతి గృహంలో ఉన్న యువతిని శుక్రవారం తల్లికి అప్పగించారు.
దర్యాప్తు ముమ్మరం
సినీ అవకాశాల పేరిట యువతిని మభ్యపెట్టి వ్యభిచారంలోకి దించిన వైనంపై నగర పోలీసు కమిషనర్ డి.గౌతమ్ సవాంగ్ స్పందించి పలుకుబడితో నిమిత్తం లేకుండా నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు. ఈ క్రమంలోనే మహేంద్ర స్వస్థలమైన గుంటూరు జిల్లా చిలకలూరిపేట వెళ్లిన టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందం పలు చోట్ల ఆరా తీసినట్టు తెలిసింది. ఇతని ప్రధాన అనుచరునిగా భావిస్తున్న ఓ యువకుణ్ణి అదుపులోకి తీసుకొని నగరానికి తీసుకొచ్చారు. ఇతని కోసం ఖచ్చితంగా మహేంద్ర వస్తాడనే అభిప్రాయంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉన్నారు. భీమవరానికి చెందిన విజయ్ ఏలూరులో ఉన్నట్టుగా సెల్‌టవర్‌ను బట్టి పోలీసులు గుర్తించారు. ఆ దిశగా పట్టివేత ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు పెద్దల ద్వారా లొంగిపోయేందుకు విజయ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
వ్యభిచార ‘బ్రోకర్ల’ కోసం వేట
Published Sat, Nov 7 2015 1:55 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement
Advertisement