బాలికలకు మాయమాటలు చెప్పి వ్యభిచారకూపం లోకి దింపుతున్న ఇద్దరు వ్యక్తులను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు.
పనాజీ: బాలికలకు మాయమాటలు చెప్పి వ్యభిచారకూపం లోకి దింపుతున్న ఇద్దరు వ్యక్తులను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు బాలికలను వీరి చెర నుంచి విడిపించారు. శుక్రవారం రాత్రి నుంచి కొనసాగిన ఆపరేషన్ వివరాలను పోర్వోరిమ్ పోలీసులు వెల్లడించారు. రాష్ట్ర నీటిశాఖ విభాగంలో పంప్ ఆపరేటర్ గా ప్రవీణ్ పరాబ్ పనిచేస్తున్నాడు. సాజియా ఖాన్ అనే మహిళ ముంబైలో ఉంటోంది. వీరిద్దరు కలిసి గత కొంత కాలం నుంచి యువతుల్ని ఏదో విధంగా ప్రలోభపెట్టి వ్యభిచారకూపంలోకి లాగేవారు. ముంబై ఇన్-స్పెక్టర్ జివ్బా దాల్వీ ఈ రెస్క్యూ ఆపరనేషన్ టీమ్ కు నేతృత్వం వహించారు.
నిందితుల వ్యవహారంపై ఫిర్యాదులు రావడంతో కొంత కాలం నుంచి వీరిపై నిఘా ఉంచినట్లు తెలిపారు. కస్టమర్ రూపంలో వెళ్లిన ఓ పోలీస్ ప్రవీణ్ పరాబ్ చేసే వ్యవహరాలపై సాక్ష్యాధారాలను సంపాదించాడు. అమ్మాయిలను రప్పిస్తామని నిందితుడు చెప్పిన ప్రాంతానికి పోలీసులు వెళ్లి సెక్స్ రాకెట్ నడుపుతున్న ఓ మహిళ సహా ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ముగ్గురు బాలికలను ఈ కూపం నుంచి రక్షించారు. వీరిలో ఇద్దరు కర్ణాటకకు చెందిన వారు, మరో బాలిక స్వస్థలం ముంబై అని పోలీసులు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు వివరించారు.