మసాజ్‌ ముసుగులో.. గుట్టురట్టు! | Police raided on massage centers in guntur | Sakshi
Sakshi News home page

Feb 24 2018 10:06 AM | Updated on Aug 24 2018 2:33 PM

Police raided on massage centers in guntur - Sakshi

సాక్షి, గుంటూరు : నగరంలో మసాజ్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మసాజ్‌ సెంటర్‌ గుట్టును పోలీసులు రట్టు చేశారు. లక్ష్మీపురంలోని బౌన్స్ బ్యూటీ అండ్ మసాజ్ సెంటర్‌పై తర్వాత దాడులు నిర్వహించారు. ఇక్కడ మసాజ్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఒక్కసారిగా దాడులు చేశారు.  

ఈ దాడుల్లో నలుగురు మహిళలు, నిర్వాహకుడు రామచంద్రరావుతోపాటు అతని అసిస్టెంట్‌, ఒక విటుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18వేల రూపాయల నగదుతోపాటు, 11సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బౌన్స్ బ్యూటీ అండ్ మసాజ్ సెంటర్‌ను నాలుగేళ్ల నుంచి రామచంద్రరావు అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను బ్యూటీ పార్లర్‌లో వర్కర్లుగా పనిచేయిస్తున్నాడు. అయితే నష్టాలు రావడంతో నిర్వాహకుడు రామచంద్రరావు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు.  మహిళలతో పురుషులకు మసాజ్ చేయించడమే కాకుండా వ్యభిచారం కూడా చేయిస్తున్నాడు. అర్బన్ ఎస్పీకి వచ్చిన సమాచారం మేరకు మసాజ్ సెంటర్‌పై నిఘా పెట్టిన పోలీసులు దాడులు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement