మైనర్ బాలికల అమ్మకాల్లో ఇద్దరు అరెస్ట్! | Two arrested for pushing girls from MP into prostitution | Sakshi
Sakshi News home page

మైనర్ బాలికల అమ్మకాల్లో ఇద్దరు అరెస్ట్!

Published Sat, Jul 23 2016 8:41 PM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM

Two arrested for pushing girls from MP into prostitution

థానెః బాలికలను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి నెడుతున్న ఇద్దరు వ్యక్తులను థానే పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికలను వ్యభిచార వృత్తిలోకి నెట్టే ప్రయత్నం చేసిన నిందితులను థానే మీరారోడ్ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను సంజయ్ సింగ్, సరోజ్ దేవీ లుగా గుర్తించారు.

మధ్యప్రదేశ్ సైడోల్ జిల్లా ఛిపాయ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మైనర్ బాలికలను ఆగ్రాకు చెందిన పింకి సింగ్ ద్వారా నిందితులు మార్చి నెలలో అమ్మకానికి పెట్టినట్లు మీరారోడ్ పోలీస్ స్టేషన్  కు చెందిన ఇనస్పెక్టర్ జగదీష్ షిండే తెలిపారు. బాధిత బాలికలు  సైడోల్ జిల్లా భివారీ తెహసిల్ కు చెందినవారుగా  వెల్లడించారు. బాలికల ఫిర్యాదు మేరకు  ఐపీసీ సెక్షన్ 372 కింద (వ్యభిచారం కోసం బాలికల అమ్మకం), వ్యభిచార నిరోధానికి సంబంధించిన ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ (పీటా), ప్రొటెకక్షన్ ఆఫ్ ఛిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ ఆఫెన్సెస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు  పోలీసు అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement