Hyderabad Spa Raid: Prostitution Racket Busted At Spa In East Marredpally Hyderabad - Sakshi
Sakshi News home page

సెలూన్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం.. ఇద్దరు మహిళలు, విటుడు అరెస్ట్‌

Published Wed, Feb 9 2022 2:48 PM | Last Updated on Wed, Feb 9 2022 3:54 PM

Hyderabad: Prostitution Racket Busted At Spa Parlour - Sakshi

సాక్షి, అడ్డగుట్ట: స్పా అండ్‌ సెలూన్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్‌ నిర్వాహకుల గుట్టురట్టు చేశారు పోలీసులు. ఈ ఘటన తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ ఎల్లప్ప కథనం ప్రకారం.. ఈస్ట్‌ మారేడుపల్లిలోని గీతా టిఫిన్స్‌ ఎదురుగా ఉన్న లరీసా ఎక్స్‌క్లూసివ్‌ స్పా అండ్‌ సెలూన్‌ సెంటర్‌ నిర్వాహకులు రంగం కిషోర్‌(35), అనీష్‌(25) సెంటర్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు సోమవారం తుకారాంగేట్‌ పోలీసులు సెంటర్‌పై దాడి చేశారు. సెంటర్‌ యజమానులు కిషోర్, అనీష్‌లతో పాటు ఇద్దరు మహిళలను, విటుడు ఆంటొనీ(46)ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు సెల్‌ఫోన్లు, రూ. 1500 నగదు స్వాధీనం చేసుకొని మంగళవారం రంగం కిషోర్, అనీష్, ఆంటొనీలను రిమాండ్‌ చేశారు. మహిళలను ప్రజల్వ హోంకు తరలించినట్లు తెలిపారు.   

చదవండి: అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం.. పోలీసుల అదుపులో మహిళ, విటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement