
సాక్షి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని పలు స్పా సెంటర్లపై శుక్రవారం పోలీసులు దాడులు చేపట్టారు. స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు ఆరుగురు యువతులు, ఆరుగురు విటులు, ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.