ఇళ్లు అద్దెకు తీసుకొని..గుట్టుగా వ్యభిచారం | Task Force Police Raids And Arrest Prostitution Gang In Adilabad | Sakshi
Sakshi News home page

ఇళ్లు అద్దెకు తీసుకొని..గుట్టుగా వ్యభిచారం

Published Fri, Dec 25 2020 9:16 AM | Last Updated on Fri, Dec 25 2020 10:30 AM

Task Force Police Raids And Arrest Prostitution Gang In Adilabad - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీఐ పురుషోత్తంరెడ్డి, పక్కనే ప్రధాన నిందితుడు, ఇద్దరు విటులు

ఆదిలాబాద్‌రూరల్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని టీచర్స్‌ కాలనీలోని ఓ వ్యభిచార గృహంపై గురువారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐ చంద్రమౌళి తెలిపిన కథనం ప్రకారం.. మావల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని టీచర్స్‌ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది ఆదిలాబాద్‌ గ్రామీణ సీఐ పురుషోత్తంతో కలిసి వ్యభిచార గృహంపై ఆకస్మిక దాడి చేసి మహిళ, వ్యభిచార గృహ నిర్వాహకుడు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, డైరీలు, రూ.7700 నగదు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వారిలో నిర్వాహకుడైన ప్రధాన నిందితుడు ఉట్నూర్‌ మండలం గంగన్నపేటకు చెందిన పిండి మల్లికార్జున్, విటులు కరీంనగర్‌ పట్టణంలోని రాంనగర్‌కి చెందిన సిందం కుమార్, తాంసి మండలంలోని గోట్కూరికి చెందిన దర్శనాల సాయికుమార్‌ ఉన్నారు. అనంతరం ఆదిలాబాద్‌ గ్రామీణ సీఐ పురుషోత్తం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్మీలో ఉద్యోగ విరమణ చేసిన ఉట్నూర్‌ మండలం గంగన్న పేటకు చెందిన పిండి మల్లికార్జున్‌ కొంతకాలంగా ఆదిలాబాద్‌లోని టీచర్స్‌ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నిస్సహాయులైన మహిళలచే వ్యభిచారం చేయిస్తున్నట్లు వెల్లడించారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఎస్‌కే తాజొదీ్దన్, జగన్‌సింగ్, రహాత్, మావల ఏఎస్సై గంగాధర్, కానిస్టేబుళ్లు సరిత, మౌనిక, సోనీ, తదితరులు పాల్గొన్నారు.   

     


   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement