
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్(నాగోలు): ఎల్బీనగర్ పోలీసులు ఓ వ్యభిచార గృహం గుట్టును రట్టు చేశారు. గృహం నిర్వాహకురాలితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి సెల్‌ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుని నిందితులను శనివారం రిమాండ్‌కు తరలించారు. ఎల్‌బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా లక్ష్మీపురం కాలనీకి చెందిన ఎస్. వెంకటలక్ష్మి(68) బైరామల్‌గూడ రెడ్డి కాలనీలోని తన సోదరుడి ఇంట్లో కొంత కాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తోంది.
చదవండి: (కలహాలతో విసిగిపోయి.. బిడ్డతో సహా కావేరి నదిలో దూకి..)
సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్ పోలీసులు శుక్రవారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేసి విటుడు చట్టి సద్గుణరావుతో పాటు వెంకటక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా కారణంగా కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెంకటలక్ష్మి సులభంగా డబ్బులు సంపాదించేందుకు వ్యభిచార వృత్తిని ఎంచుకుంది. తనకు తెలిసిన సెక్స్‌వర్కర్లతో ఒప్పందం చేసుకుని వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోంది. కాగా, గతంలోనూ వెంకటలక్ష్మిని పోలీసులు వ్యభిచారం కేసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన వెంకటలక్ష్మి మళ్లీ అదే వృత్తిని కొనసాగిస్తూ పట్టుబడింది.
Comments
Please login to add a commentAdd a comment