వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఇద్దరు యువతులతో.. | Police Busted Prostitution Racket In Vizianagaram | Sakshi
Sakshi News home page

వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఇద్దరు యువతులతో..

Published Wed, Aug 10 2022 2:52 PM | Last Updated on Wed, Aug 10 2022 4:01 PM

Police Busted Prostitution Racket In Vizianagaram - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,విజయనగరం క్రైమ్‌: స్థానిక కస్పా హైసూ్కల్‌ సమీపంలో ఒక గ్రూప్‌ హౌస్‌లో మేడమీద వ్యభిచారం చేస్తున్న ఇద్దరు నిర్వాహకులను టూటౌన్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సీఐ లక్ష్మణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. కస్పా హైస్కూల్‌ సమీపంలో ఉన్న గ్రూప్‌హౌస్‌ మేడమీద ఉంటున్న ఇద్దరు మహిళలు ఇద్దరేసి యువతులు చొప్పున తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారు.

ఈ మేరకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి నిర్వాహకులైన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.

చదవండి: నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం.. ఎస్సై పరీక్ష సరిగ్గా రాయలేదని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement