హైదరాబాద్: వ్యభిచార గృహాలపై దాడి చేసిన పోలీసులు ఇద్దరు విటులతో పాటు ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఈ సంఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైనిక్‌పురి కార్తికేయనగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా ఓ గృహంలో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో పాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.