బంజారాహిల్స్: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తుండగా సహ నిర్వాహకుడితో పాటు నలుగురు విటులను అరెస్టు చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబరు.12లోని పీస్ రెయిన్ స్పాలో వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు పోలీసులు దాడులు చేశారు. సహ నిర్వాహకుడు సయ్యద్ బిల్లాల్, విటులు ఫహద్, హసీదుద్దిన్, మహ్మద్ ఇమ్రానంద్, కమల్ కిషోర్‌లను అరెస్టు చేశారు.
వీరంతా నగరంలోని ప్రముఖుల కుమారులని తెలిసింది. స్పాలో ఉద్యోగం పేరిట ఐదుగురు యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్టు తేలింది. ఈ ఐదుగురిని రెస్క్యూ హోంకు తరలించారు. వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, 30 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment