
ప్రతీకాత్మక చిత్రం
యశవంతపుర(బెంగళూరు): బెంగళూరులో బాడుగ ఇళ్లు తీసుకుని వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న 8 మంది బంగ్లాదేశ్‌వాసుల్ని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. కెంగేరి, సోలదేవనహళ్లి రెండు చోట్ల దాడులు జరిపి ఇద్దరు మహిళలు, ఆరుమంది పురుషులను అరెస్ట్ చేశారు.
ప్రాథమిక విచారణలో తాము భారతీయులమంటూ బాడుగ ఇళ్లు తీసుకొని మహిళలను, విటులను రప్పించి పడుపు వృత్తి చేయిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర పౌరులమని ఇంటి యజమానులకు ఆధార్ కార్డులను చూపారు. పోలీసుల విచారణలో బంగ్లాదేశ్‌లో కరోనా టీకా వేయించుకున్న సర్టిఫికెట్లతో పాటు భారతీయులు కాదని నిరూపించే ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment