కడప అర్బన్: కడప వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ద్వారకా నగర్‌లో ఓ ఇంటిలో వ్యభిచారం నడుపుతున్న నిర్వాహకుడు ఫ్రాన్సిస్‌తోపాటు మరో 8 మంది మహిళలను వన్ టౌన్ ఇన్‌చార్జి సీఐ మోహన్ ప్రసాద్, ఎస్‌ఐ నాగరాజు తమ సిబ్బందితో కలిసి వెళ్లి శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12 సెల్‌ఫోన్లు, రూ.2700 నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణకు నేరుగా వచ్చిన సమాచారం మేరకు సదరు వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసినట్లు సమాచారం. మహిళలను మహిళా సంరక్షణ కేంద్రానికి పంపారు. వారిలో నిందితులను శనివారం కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ తెలిపారు.