మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం
చెన్నై: పుదుచ్చేరిలోని ఓ మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పుదుచ్చేరి కొత్త బస్టాండ్ సమీపంలోని మరైమలైయడిగల్ రోడ్డులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న మసాజ్ సెంటర్లపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ఓ మసాజ్ సెంటర్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు కనుగొన్నారు. ఆ ముఠాను పట్టుకునేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లను మఫ్టీలో మసాజ్ చేయించుకునేందకు సెంటర్‌కు పంపారు. వీరు మసాజ్ సెంటర్‌కు వెళ్లగానే తలా మూడు వేల రూపాయిలు తీసుకుని ఆరుగురు మహిళలను అక్కడ నిలబెట్టారు.
పోలీసులు ఎంపిక చేసుకున్న ఇద్దరు మహిళలు అసభ్యంగా ప్రవర్తించసాగారు. వెంటనే బయట ఉన్న అధికారులకు ఎస్‌ఎంఎస్ పంపగా వారు మసాజ్ సెంటర్లోని ఆరుగురు మహిళలను రక్షించారు. వారిలో పుదుచ్చేరి సామిపిల్లై తోటకు చెందిన శశి(32), తమిళ్‌సెల్వి(31), దిండివనంకు చెందిన కార్తిక్(23), లాస్పేట్‌కు చెందిన గురుసామి(33)గా తెలిసింది. మసాజ్ సెంటర్ నిర్వాహకురాలు ముత్యాలపేటకు చెందిన రాధిక అలియాస్ ఆరోగ్యమేరి కోసం గాలిస్తున్నారు. అరెస్టైన నలుగురిని శుక్రవారం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి కాలాపట్టు జైలులో ఉంచారు.