Massage Centre
-
లోటస్ బ్లిస్ స్పా పేరుతో వ్యభిచారం.. సుజాతపై ఇప్పటికే..
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మసాజ్‌సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిసెప్షనిస్ట్ సచిన్, విటులు సతీష్, రాజ్‌కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో నలుగురు యువతులను రక్షించారు. లోటస్ బ్లిస్ స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వివిధ వర్గాల వారిని తన బుట్టలో వేసుకుని చాలా రోజులుగా వ్యభిచారం సాగిస్తున్నట్లు నిర్వహకురాలు సుజాతపై ఆరోపణలు ఉన్నాయి. సుజాతపై గతంలో కూడా పలు సెక్షన్ల కింద మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. చదవండి: (థర్డ్‌వేవ్ ప్రారంభమైంది.. జనవరి చివరి నాటికి..) -
సివిల్స్ ర్యాంకర్ @ మసాజ్ సెంటర్
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు గరిక సంతోష్ కుమార్. రెండేళ్ల క్రితం యూపీఎస్సీ పరీక్షల్లో ర్యాంకు సాధించాడు. కేసు పెండింగ్‌లో ఉండటంతో ఎంపిక ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎవరైనా ఆ కేసు ముగించుకునే మార్గాలు అన్వేషిస్తారు. సంతోష్ మాత్రం దీనికి పూర్తి ‘భిన్నం’. మసాజ్ సెంటర్ నిర్వాహకుడిగా మారి మరో కేసును తనపై వేసుకున్నాడు. ‘క్రాస్ మసాజ్’లు నిర్వహిస్తున్న ఆరోపణలపై సంతోష్ సహా ఏడుగురు నిందితుల్ని మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు సోమవారం వెల్లడించారు. విశాఖపట్నానికి చెందిన సంతోష్ కుమార్ ఫిజిక్స్ విభాగంలో ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. సివిల్స్ కోచింగ్ కోసం సిటీకి వచ్చి అశోక్‌నగర్ చౌరస్తాలో ఉన్న ఓ ఇన్స్టిట్యూట్లో దాదాపు ఏడాది కోచింగ్ తీసుకున్నాడు. ఆ సమయంలోనే వైఎంసీఏ చౌరస్తాలోని స్లా్పష్ సెలూన్లో భాగస్వామిగా చేరాడు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మరో భాగస్వామితో వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో అతడి భార్యపై దాడి చేశాడనే ఆరోపణలతో సంతోష్‌పై నారాయణగూడ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టు అయి, బెయిల్‌పై బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఇది కోర్టు విచారణ దశలో ఉంది. ఇదిలా ఉండగా 2016లో సివిల్స్ రాసిన సంతోష్ తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలు విజయవంతంగా పూర్తి చేసి ర్యాంకు సాధించాడు. అయితే నారాయణగూడలో క్రిమినల్ కేసు నమోదై ఉండడంతో ఎంపిక ప్రక్రియకు బ్రేక్ వేసిన యూపీఎస్సీ సంతోష్ పేరును విత్‌హెల్డ్‌లో పెట్టింది. మరోపక్క ఆ సెలూన్‌ను సంతోష్ బంధువైన రాధారెడ్డి స్పాగా మార్చారు. మగవారికి ఆడవారితో మసాజ్‌లు చేయించడం (క్రాస్ మసాజ్) చట్ట విరుద్ధమైనప్పటికీ అలా చేస్తూ మూడుసార్లు పోలీసులకు చిక్కారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆరు నెలల క్రితం ‘స్పా’ బాధ్యతలు చేపట్టిన సంతోష్ క్రాస్ మసాజ్‌ల పరంపరను కొనసాగించాడు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతుల్ని ఉద్యోగినులుగా నియమించుకున్నాడు. వీరితో కస్టమర్లకు మసాజ్‌లు చేయిస్తూ భారీగా వసూలు చేస్తున్నాడు. ఈ ఉద్యోగినులకు కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నాడు. కస్టమర్లకు మసాజ్ చేసిన సందర్భంలో వారిచ్చిన టిప్పులతోనే ఈ యువతులు బతుకీడుస్తున్నారు. స్లా్పష్ స్పా వ్యవహారాలపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్సైలు జి.తిమ్మప్ప తమ బృందంతో సోమవారం స్పాపై దాడి చేశారు. సంతోష్‌తో పాటు రిసెప్షనిస్ట్ వై.శ్రీకాంత్, కస్టమర్లు ఎల్.గోపినాథ్, కె.కుమార్, మసాజ్ చేసే యువతులను అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు, సెల్ఫోన్లు తదిరాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నేపథ్యంలో తాను సివిల్స్ ర్యాంకర్ అని, కేసుతో ఎంపికకు బ్రేక్ పడిందని సంతోష్ చెప్పడంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు అవాక్కయ్యారు. రికార్డులు పరిశీలించిన అధికారులు అతడు చెప్పింది నిజమేనని ధ్రువీకరించారు. తదుపరి చర్యల నిమిత్తం సంతోష్ సహా నిందితుల్ని నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. దీంతో కలిపి అదే ఠాణాలో సంతోష్‌పై రెండు కేసులు ఉన్నట్లైంది. -
బ్యూటీ పార్లర్ ముసుగులో మసాజ్ సెంటర్
హైదరాబాద్(చైతన్యపురి): బ్యూటీ పార్లర్ ముసుగులో క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్న సెంటర్‌పై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి నిర్వాహకురాలు, ఇద్దరు యువతులను, ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 8 వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్మన్‌ఘట్‌కు చెందిన ప్రతిజ (28) మోహన్‌నగర్ చౌరస్తాలో స్పార్కిల్ బ్యూటీ సెలూన్‌ను నిర్వహిస్తుంది. కొంత కాలంగా అమ్మాయిలతో క్రాస్ మసాజ్ చేయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గోల్కొండకు చెందిన యువతి, సంతోష్‌నగర్‌కు చెందిన మహిళ, ఉప్పుగూడకు చెందిన మల్లేష్, కర్మన్‌ఘట్‌కు చెందిన దుర్గారావులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 8,720 నగదు, తొమ్మిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని చైతన్యపురి పోలీసు స్టేషన్లో అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం
చెన్నై: పుదుచ్చేరిలోని ఓ మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. పుదుచ్చేరి కొత్త బస్టాండ్ సమీపంలోని మరైమలైయడిగల్ రోడ్డులో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న మసాజ్ సెంటర్లపై పోలీసులు నిఘా ఉంచారు. ఈ క్రమంలో ఓ మసాజ్ సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నట్లు కనుగొన్నారు. ఆ ముఠాను పట్టుకునేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లను మఫ్టీలో మసాజ్ చేయించుకునేందకు సెంటర్‌కు పంపారు. వీరు మసాజ్ సెంటర్‌కు వెళ్లగానే తలా మూడు వేల రూపాయిలు తీసుకుని ఆరుగురు మహిళలను అక్కడ నిలబెట్టారు. పోలీసులు ఎంపిక చేసుకున్న ఇద్దరు మహిళలు అసభ్యంగా ప్రవర్తించసాగారు. వెంటనే బయట ఉన్న అధికారులకు ఎస్ఎంఎస్ పంపగా వారు మసాజ్ సెంటర్లోని ఆరుగురు మహిళలను రక్షించారు. వారిలో పుదుచ్చేరి సామిపిల్లై తోటకు చెందిన శశి(32), తమిళ్‌సెల్వి(31), దిండివనంకు చెందిన కార్తిక్(23), లాస్పేట్‌కు చెందిన గురుసామి(33)గా తెలిసింది. మసాజ్ సెంటర్ నిర్వాహకురాలు ముత్యాలపేటకు చెందిన రాధిక అలియాస్ ఆరోగ్యమేరి కోసం గాలిస్తున్నారు. అరెస్టైన నలుగురిని శుక్రవారం మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి కాలాపట్టు జైలులో ఉంచారు. -
మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
-
మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్: మసాజ్ సెంటర్ల నిర్వహణ ముసుగులో కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్‌లో కొన్ని చోట్ల మసాజ్ సెంటర్లను ఏకంగా వ్యభిచార కేంద్రాలుగా మార్చేసి దందా చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఏఎస్ రావు నగర్‌లోని ఓ సెంటర్‌పై దాడి చేశారు. కొంతకాలంగా మసాజ్ సెంటర్ మాటున వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు సమాచారం వచ్చింది. పోలీసులు ఇద్దరు మహిళలతో పాటు ఇద్దరు విటులు, మసాజ్ సెంటర్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. నిందితులను కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. -
ఉప్పల్‌లో మసాజ్ సెంటర్‌పై దాడి: ఐదుగురు అరెస్ట్
ఉప్పల్‌లోని ఓ మసాజ్ సెంటర్‌పై బుధవారం ఉదయం పోలీసులు దాడి చేశారు. ముగ్గురు మహిళలు సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు స్థానికులు సమాచారం అందించారని పోలీసులు వెల్లడించారు. దాంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని ఉప్పల్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.