![Prostitution in Massage Centers Madhapur Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/18/Prostitution.jpg.webp?itok=exxQpC8m)
ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మసాజ్‌సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిసెప్షనిస్ట్ సచిన్, విటులు సతీష్, రాజ్‌కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో నలుగురు యువతులను రక్షించారు. లోటస్ బ్లిస్ స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వివిధ వర్గాల వారిని తన బుట్టలో వేసుకుని చాలా రోజులుగా వ్యభిచారం సాగిస్తున్నట్లు నిర్వహకురాలు సుజాతపై ఆరోపణలు ఉన్నాయి. సుజాతపై గతంలో కూడా పలు సెక్షన్ల కింద మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment