
పోలీసుల అదుపులో నిందితులు
హైదరాబాద్(చైతన్యపురి):
బ్యూటీ పార్లర్ ముసుగులో క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్న సెంటర్‌పై ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి నిర్వాహకురాలు, ఇద్దరు యువతులను, ముగ్గురు కస్టమర్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 8 వేల నగదు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకుని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్మన్‌ఘట్‌కు చెందిన ప్రతిజ (28) మోహన్‌నగర్ చౌరస్తాలో స్పార్కిల్ బ్యూటీ సెలూన్‌ను నిర్వహిస్తుంది. కొంత కాలంగా అమ్మాయిలతో క్రాస్ మసాజ్ చేయిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా గోల్కొండకు చెందిన యువతి, సంతోష్‌నగర్‌కు చెందిన మహిళ, ఉప్పుగూడకు చెందిన మల్లేష్, కర్మన్‌ఘట్‌కు చెందిన దుర్గారావులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 8,720 నగదు, తొమ్మిది సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుని చైతన్యపురి పోలీసు స్టేషన్‌లో అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.