మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్: మసాజ్ సెంటర్ల నిర్వహణ ముసుగులో కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్లో కొన్ని చోట్ల మసాజ్ సెంటర్లను ఏకంగా వ్యభిచార కేంద్రాలుగా మార్చేసి దందా చేస్తున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఏఎస్ రావు నగర్‌లోని ఓ సెంటర్‌పై దాడి చేశారు. కొంతకాలంగా మసాజ్ సెంటర్ మాటున వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు సమాచారం వచ్చింది. పోలీసులు ఇద్దరు మహిళలతో పాటు ఇద్దరు విటులు, మసాజ్ సెంటర్ నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు. నిందితులను కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.