టీడీపీ నేతల రాసలీలలు | TDP Leader Arrested In Prostitution Case, Police Allegedly Erase CCTV Footage Amid Controversy In Kadapa-Kurnool Region | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల రాసలీలలు

Mar 23 2026 5:59 AM | Updated on Mar 23 2026 11:59 AM

Tdp leader arrested prostitution case: Andhra pradesh

వ్యభిచారం చేస్తూ దొరికిపోయి పోలీసు స్టేషన్లో కూర్చున్న రావూరు రాధాకృష్ణ

 ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓ మహిళతో తరచూ ఓ హోటల్‌కు వెళ్తున్న టీడీపీ ఎమ్మెల్యే

ప్రత్యర్థులు నిఘా పెట్టారని తెలిసి అక్కడికి వెళ్లిన ఓ పోలీసు అధికారి 

కరెంట్‌ ఆపేసి వారిని అక్కడి నుంచి తప్పించేసిన వైనం 

ఆధారాలు దొరక్కుండా సీసీ ఫుటేజీ మాయం  

నెల్లూరులో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ముఖ్య అనుచరుడు

సాక్షి టాస్క్ ఫోర్స్‌: అధికార టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు కామకేళీలో ఒకరిని మించి మరొకరు అన్నట్లు రాసలీలల్లో మునిగి తేలుతున్నా రు. ప్రజల సమస్యలను పరిష్కరించడం మరచిపో యి వివాహేతర సంబంధాల్లో బిజీగా గడుపుతున్నా రు. ఈ క్రమంలో అధికార పారీ్టకి చెందిన ఓ శాసనసభ్యుడి రాసలీలలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారాయి. తన పేరులోనే వెలిగిపోయే సదరు టీడీపీ ఎమ్మెల్యే ఓ మహిళతో పక్క నియోజకవర్గంలోని హోటల్‌లో ఏకాంతంగా గడిపి వివాదంలో ఇరుక్కున్నట్లు ప్రసార మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఎవరా ఎమ్మెల్యే.. అని సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆ ఎమ్యెల్యే తరచూ ఆమెతో నల్లమల ఫారెస్ట్‌కు సమీపంలో ఉండే ఆ ఊళ్లోని హోటల్‌కు వచి్చవెళ్తున్నట్లు ప్రత్యర్థులు పసిగట్టి నిఘా పెట్టారు.

ఇటీవల ఓ రోజు రాత్రి ఆ హోటల్‌లో ఆ ఎమ్మెల్యే ఆ మహిళతో ఉన్న సమయంలో ప్రత్యర్థులు అక్కడికి వెళ్లారనే విషయాన్ని తెలుసుకున్న ఓ పోలీసు అధికారి ఆగమేఘాలపై అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేను కాపాడాలనే ఉద్దేశంతో హోటల్‌లో విద్యుత్‌ సరఫరాను నిలిపి వేయించారు. చీకట్లో ఎమ్మెల్యేతో పాటు ఆ మహిళను కూడా అక్కడి నుంచి తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతటితో ఆగక.. ఆ ఎమ్మెల్యే, ఆ మహిళకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా హోటల్‌లోని సీసీ ఫుటేజీ తొలగించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే ఆ హోటల్‌కు ఎదురుగా ఉన్న వ్యాపార సముదాయంలోని సీసీ ఫుటేజీను కూడా మాయం చేయించినట్లు పోలీస్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆ హోటల్‌లో ఏమీ జరగకపోతే అంత హడావుడిగా సీసీ ఫుటేజీని ఎందుకు మాయం చేశారని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. కాగా, సదరు ఎమ్మెల్యే రాసలీలలకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పటికే ప్రభుత్వ పెద్దలకు చేరిందని స్థానిక టీడీపీ నేతలు చెబుతున్నారు.  

నెల్లూరులో కీలక టీడీపీ నేత బాగోతమిది 
నెల్లూరు చిన్నబజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నాలుగు లాడ్జీల్లో ఆదివారం నగర ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో  వెంకటాచలం మండలం నిడుగుంటపాళేనికి చెందిన టీడీపీ నేత రావూరు రాధాకృష్ణ ఓ మహిళతో గడుపుతూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈయన టీడీపీ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి అత్యంత ఆప్తుడు. చౌటపాళెం ప్రాథమిక వ్యవసాయ కో ఆపరేటివ్‌ సొసైటీ అ««ధ్యక్షుడు కూడా. పోలీసుల దాడుల్లో 17 మంది విటులు, 14 మంది మహిళలు పట్టుబడ్డారు.

వీరిలో రాధాకృష్ణ సైతం ఉండడంతో వారందరినీ తీసుకొచ్చి పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టారు. విషయం తెలుసుకున్న టీడీపీ కీలక నేతలు ఆయన పేరును తొలగించాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. అప్పటికే ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. పైనుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో సదరు టీడీపీ నేత ఆస్పత్రిలో చూపించుకోవడానికి వచి్చ, సాయి గ్రాండ్‌ లాడ్జి వద్ద ఉండగా తాము తీసుకొచ్చామని.. విషయం తెలుసుకుని వదిలేశామని పోలీసులు చెప్పుకొచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement