Bhojpuri Actress and Model Arrested for Prostitution Racket at 5 Star Hotel - Sakshi
Sakshi News home page

ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో వ్యభిచారం.. నటితో సహా మోడల్ అరెస్ట్!

Published Sat, May 13 2023 7:52 PM | Last Updated on Sat, May 13 2023 8:41 PM

Bhojpuri actress and Model arrested for prostitution racket at 5 star hotel - Sakshi

మహారాష్ట్రలోని పుణె పోలీసులు భారీ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. పుణేలోని వాకాడ్ ప్రాంతంలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో నిర్వహిస్తున్న భారీ వ్యభిచార రాకెట్‌ను ఛేదించారు. ఈ దాడుల్లో భోజ్‌పురి నటితో సహా ఓ మోడల్‌, ఏజెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

(ఇది చదవండి: అవునా.. ఆ వార్త నావరకు రాలేదు: నిహారిక

వ్యభిచార ముఠా గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం సాయంత్రం హోటల్‌పై దాడులు నిర్వహించారు. వారిలో ఒకరు మోడల్, మరొకరు భోజ్‌పురి నటిగా పోలీసులు గుర్తించారు. వీరు మహిళలను మభ్యపెట్టి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పింప్రీ, చించ్‌వాడ్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ దేవేంద్ర చవాన్ వార్నింగ్ ఇచ్చారు. 

(ఇది చదవండి: సితార.. నీ హృదయంతో చేయి.. నమ్రత పోస్ట్ వైరల్!)

ఇన్‌స్పెక్టర్ దేవేంద్ర మాట్లాడుతూ..' ఫైవ్ స్టార్ హోటల్‌లో ఏజెంట్‌తో కలిసి భోజ్‌పురి నటి, మోడల్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు మాకు సమాచారం అందింది.  మేం వెంటనే ఓ డమ్మీ కస్టమర్‌ను అక్కడికి పంపాం. ఏజెంట్‌ను ఆన్‌లైన్‌ ద్వారా సంప్రదించాం. ఏజెంట్.. డమ్మీ కస్టమర్‌ని ఫైవ్ స్టార్ హోటల్‌లో గదిని బుక్ చేయమని చెప్పాడు. నటి, మోడల్ ఫోటోలను కూడా షేర్ చేశాడు. అన్ని నిర్ధారించుకున్న తర్వాతే అటాక్ చేశాం.' అని  వెల్లడించారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement