పోలీసుల అదుపులో
ఐదుగురు నిందితులు
యజమానులపై కేసు నమోదు
పెబ్బేరు : రెండు లాడ్జీల్లో వ్యభిచారం కొనసాగుతుండగా పోలీసులు దాడి చేసి ఐదుగురిని పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. పెబ్బేరులోని జయదేవ్, సాయి లాడ్జీల్లో కొంతకాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లు స్థానికులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతి వారం జరిగే సంతకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కొందరు వచ్చి ఇక్కడ వ్యభిచారానికి పాల్పడుతున్నట్టు తెలుసుకున్నారు. దీంతో శనివారం అర్ధరాత్రి ఎస్‌ఐ రమేష్ ఆధ్వర్యంలో ఈ లాడ్జీల్లో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు పట్టుబడ్డారు. ఈ మేరకు లాడ్జీల యజమానులు చెన్నయ్య, రుక్మందరెడ్డిలపై కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
2 లాడ్జీల్లో వ్యభిచారం
Published Mon, Mar 7 2016 4:13 AM | Last Updated on Sun, Sep 2 2018 3:43 PM
Advertisement
Advertisement